జులైలో మనం విశాఖ వెళ్తున్నాం- జగన్

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో జ‌రిగిన కేబినేట్ భేటిలో సీఎం జ‌గ‌న్ రాజ‌ధానిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జులైలో విశాఖకు వెళ్తామ‌ని మంత్రుల‌తో ఆయ‌న చెప్పిన‌ట్లు తెలుస్తోంది. కాగా త్వ‌ర‌లోనే విశాఖ‌కు షిప్ట్ అవుతామ‌ని…

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో జ‌రిగిన కేబినేట్ భేటిలో సీఎం జ‌గ‌న్ రాజ‌ధానిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జులైలో విశాఖకు వెళ్తామ‌ని మంత్రుల‌తో ఆయ‌న చెప్పిన‌ట్లు తెలుస్తోంది. కాగా త్వ‌ర‌లోనే విశాఖ‌కు షిప్ట్ అవుతామ‌ని ఇటీవ‌ల ప‌లు వేదిక‌పైనా సీఎం జ‌గ‌న్ చెప్పిన విష‌యం తెలిసిందే.

అయితే ఏప్రిల్ నుండి విశాఖలో పాల‌న‌ మొద‌ల‌వుతుంద‌ని వార్త‌లోచ్చిన… క్ర‌మంలో జులైలో విశాఖ‌కు షిప్ట్ అవుతాన‌ని జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అలాగే త్వ‌ర‌లో జ‌ర‌గునున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు గెల‌వాల్సిందేన‌ని సీఎం జ‌గ‌న్ మంత్రుల‌కు సృష్టం చేశారు. ఏ తేడా వ‌చ్చినా మంత్రివ‌ర్గంలో మార్పులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌థ‌కాలు, చేసిన సంక్షేమ ప‌నుల‌ను అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ఆయ‌న సూచించారు. ముందుగా స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అధ్యక్షతన ఏపీ బీఏసీ సమావేశం జరిగింది. ఈ నెల‌ 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. 9 రోజులపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.