పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాధారణంగా సినిమాల్లో చేస్తున్నప్పుడే.. పాత్రకు సన్నివేశానికి అవసరమైన దానికంటె కాస్త అతి చేస్తుంటారని అంటారు. కానీ అది సినిమా ఫార్మాట్ గనుక.. అతి చేసినా కూడా పండుతుంది. కొన్ని సన్నివేశాలకు అతి అందగిస్తుంది కూడా.
సినిమాల్లో అతిశయమైన నటన ప్రదర్శించే పవన్ కల్యాణ్.. రాజకీయ బహిరంగసభల వేదిక ఎక్కారంటే.. ఇక నటనలో తన టేలెంట్ మొత్తం బయటపడేలా ఏకపాత్రాభినయం చేసేస్తారు. అదే పార్టీ పదో ఆవిర్భావ సభ వంటి అపురూపమైన సందర్భాన్ని ఎందుకు వదిలేస్తారు. ఈ రోజు సభలో పవన్ కల్యాణ్.. తన ప్రసంగం రూపంలో నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారని అభిమానులు అంచనా వేస్తున్నారు.
రాజకీయ బహిరంగసభ అంటే వేదిక ఎక్కగానే పవన్ కల్యాణ్ పూనకం వస్తుంది. రంకెలు వేస్తారు, బుసలు కొడతారు ఇంకా అలాంటి చిన్నెలు చాలానే ప్రదర్శిస్తారు. అంతా కలిపి ఏకపాత్రాభినయాన్ని రక్తి కట్టిస్తారు. ఎంతో ఆవేశంగా.. ఊగిపోతూ.. పూనకం వచ్చిందేమో అని సభికులు భయపడేలాగా చెలరేగిపోతూ విమర్శలు కురిపిస్తుంటారు.
అంతలోనే హఠాత్తుగా ఒక వెకిలి జోకు వేసి వెకిలితనం ప్రదర్శిస్తారు. ఎంతో సీరియస్ టాపిక్ మాట్లాడుతూ మధ్యలో వెకిలితనం నిండిన ఒక లేకి జోకు వేస్తారు. దానికి వెకిలి నవ్వులు నవ్వుతారు. తాను ప్రజల్ని కూడా నవ్విస్తున్నానని అనుకుంటారు. మళ్లీ హటాత్తుగా ఆ వెకిలితనం నుంచి నిప్పులు చెరిగే సీరియస్ ప్రసంగంలోకి షిఫ్ట్ అవతారు.
గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వాన్ని ఔపోసన పట్టినట్టుగా ప్రతి ప్రసంగంలోనూ అందులోంచి పవన్ కల్యాణ్ కొన్ని మాటలు వాడుకుంటూ ఉండడం కనిపిస్తుంది. ఈ సభలో కూడా పవన్ అలాంటి కవితల వినిసిస్తారని సమాచారం.
ఎదురుగా యాక్షన్ కట్ చెప్పేవాళ్లు లేకపోతే.. ఒక్క రాజకీయ సభలోనే ఎంత గందరగోళం చేయగలడదో అందుకు నిదర్శనంగా పవన్ కల్యాణ్ నిలవబోతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.