‘సరిలేరు’ స్టేజ్ పై తమన్నా

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. జవాన్ల పార్టీలో తమన్నా ఆడిపాడిన ఈ సాంగ్ ఇప్పటికే వైరల్ అయింది. ఈపాట తెరపై ఎలా వుంటుందో చూడాలంటే…

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. జవాన్ల పార్టీలో తమన్నా ఆడిపాడిన ఈ సాంగ్ ఇప్పటికే వైరల్ అయింది. ఈపాట తెరపై ఎలా వుంటుందో చూడాలంటే 11 వరకు ఆగాలా? అవసరం లేదు. రేపు (ఆధివారం) నాడు జరిగే సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్ కు వెళ్తే చాలు.

ఆ ఫంక్షన్ లో తమన్నా లైవ్ ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. సరిలేరులో డ్యాన్స్ చేసిన పాటకే స్టేజ్ మీద ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. అయితే ఈ పాటలో సినిమాలో మాదిరిగా మహేష్ బాబు కాలు కదిలి, డ్యాన్స్ చేస్తారా? చేయరా? అన్నది మాత్రం తెలియడం లేదు. 

దేవీ లైవ్

మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా లైవ్ పెర్ ఫార్మాన్స్ ఇవ్వబోతున్నారు. సినిమాలో పాటలకు ఆయన కాలు కదిపి ప్రేక్షకులను ఉర్రూత లూగించబోతున్నారు. సినిమాలో పాటలను సినిమాలో ఆలపించిన గాయకులే వేదిక మీద పాడతారు. 

ఇవి కాక ముంబాయికి చెందిన రెండు ప్రత్యేక టీమ్ లు కూడా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వబోతున్నాయి. మెగాస్టార్ ముఖ్య అతిథిగా వస్తున్న ఈ ఫంక్షన్ బ్లాక్ బస్టర్ గా, మైండ్ బ్లాక్ గా వుండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసారు.