మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరక్టర్ విజయరామారావు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విజయరామారావు వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారంలో జన్మించిన.. ఉన్నత పాఠశాల దాకా విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగింది.తాతగారు (అమ్మ నాన్న) కల్యాణరావు స్వాతంత్ర్య సమరయోధుడు.
1959లో ట్రైనీ ఐపీఎస్ గా విధుల్లో చేరి, ఆ తర్వాత హైదరాబాద్ కమీషనర్ గా, సీబీఐ డైరక్టర్ గా పని చేశారు. సీబీఐ డైరక్టర్ గా హవాలా కుంభకోణం, బాబ్రీ మసీదు విధ్వంసం, ముంబై బాంబు పేలుళ్లు, ఇస్రో గూఢచర్యం వంటి కేసులు దర్యాప్తు చేశారు.
1999 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి.. ఆ ఎన్నికల్లో టీడీపీ నుండి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పి. జనార్థన్ రెడ్డిపై గెలిచి మంత్రి అయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన విజయరామారావు తర్వాతీ కాలంలో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు.