Advertisement

Advertisement


Home > Politics - National

హెచ్3ఎన్2 వైరస్.. మరో లాక్ డౌన్ తప్పదా..?

హెచ్3ఎన్2 వైరస్.. మరో లాక్ డౌన్ తప్పదా..?

కరోనా పోయిందని చాలామంది సంబరాలు చేసుకున్నారు. కరోనాని తరిమేశామంటూ తిరిగి పాత పద్ధతుల్లోకి వచ్చేశారు. చేతులు కడిగే అలవాటు పోయింది, తుమ్మినా, దగ్గినా మొహానికి కర్చీఫ్ అడ్డం పెట్టుకునే అలవాటూ పోయింది. రద్దీగా ఉన్న చోట కూడా మాస్క్ లేకుండా యథేచ్చగా తిరిగే స్వతంత్రం వచ్చింది. ఇదంతా ఇప్పుడు మరో విపత్తుకి దారి తీసింది. కరోనా మనుషులకు కాస్తో కూస్తో శుభ్రత, పరిశుభ్రత నేర్పింది. కానీ ఆ భయం పోయాక అందరూ పద్ధతుల్ని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు H3N2 కి ఆ నిర్లక్ష్యంతోటే వెల్కమ్ చెప్పారు. తాజాగా వ్యాపిస్తున్న ఇన్ ఫ్లూయెంజా కు కారణం హెచ్3ఎన్2 వైరస్.

విస్తరిస్తున్న హెచ్3ఎన్2 వైరస్..

కరోనా కాదు, కానీ కరోనాకి ఉండే లక్షణాల్లో 80శాతం దీనికి కూడా ఉన్నాయి. వాసన కోల్పోవడం, పల్స్ పడిపోవడం వంటివి ఉండవు కానీ, ఊపిరితిత్తుల్ని పీల్చి పిప్పిచేసే కామన్ లక్షణం మాత్రం ఈ రెండు వైరస్ లలో కనిపిస్తుంది. కరోనా కేసులు తగ్గిన తర్వాత ఇప్పుడు భారత్ లో హెచ్3ఎన్2 రకం వైరస్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువైంది. సాధారణ జలుబు, ఫ్లూ జ్వరంలాగే దీన్ని కూడా లైట్ తీసుకున్నారు చాలామంది. కానీ మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది.

ప్రతి ఏడాదీ ఇదే సమయంలో ఫ్లూ జ్వరాల కేసులు పెరుగుతాయి. వీటికి కారణం హెచ్1ఎన్1 వైరస్. దీని ఉత్పరివర్తణమే హెచ్3ఎన్2. దీని ప్రభావం ఇప్పుడు చాలా ఎక్కువగా కనపడుతోంది. మూడు నెలలుగా భారత్ లో కేసుల నమోదు పెరిగింది. తమిళనాడులో కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటివరకు 545 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రకటించింది. ఫ్లూతో బాధపడుతున్నవారు ఇప్పటికే ఆసుపత్రుల్లో చేరిన బాధితులు చికిత్సపొందుతున్నారు.

తిరుచ్చికి చెందిన ఉదయ్ కుమార్ అనే యువకుడు ఇన్ ఫ్లూయెంజా ఫ్లూ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయ్ మరణానికి హెచ్3ఎన్2 వైరస్ కారణం అని అధికారికంగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. తిరుచ్చిలో హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేసి అందరికీ పరీక్షలు నిర్వహిస్తోంది. అంతకంటే ముందు ఉత్తరాదిన రెండు మరణాలు నమోదైన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లోనూ హెచ్3ఎన్2 వైరస్ జాడ కనిపించింది. ఏపీలో 19 కేసులు వెలుగు చూసినట్టు అధికారులు చెబుతున్నారు. ఫీవర్ సర్వే మొదలు పెట్టారు. సాధారణ జలుబు వచ్చినా ఏమాత్రం ఏమరుపాటు తగదంటున్నారు. తెలంగాణలో కూడా ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య పెరిగింది. ఇది కరోనా కాదు, కానీ కరోనా లాగే ఇది కూడా ప్రాణం తీసే వ్యాధి.

మోదీ టీవీలోకి రాలేదు కదా, లాక్ డౌన్ పెట్టలేదు కదా, మాస్క్ లు పెట్టుకోవాలనే నిబంధన కేంద్రం తీసుకు రాలేదు కదా.. అని లైట్ తీసుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. గతంలోలా ఈసారి లాక్ డౌన్ లు ఉండవు, కాకపోతే ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా లైఫ్ డౌన్ అవుతుంది. సో.. బీ అలర్ట్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?