ఈ చాణక్యం ఎవరిది?

చంద్రబాబు జైల్లో వున్నారు. లోకేష్ వ్యవహారాలను అవగతం చేసుకుని, పరిస్థితిని తన కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు కిందా మీదా అవుతున్నారు. ఇలాంటి టైమ్ లో వున్నట్లుండి వ్యవహారాన్ని టర్న్ తిప్పారు. Advertisement ఓ ప్లాన్…

చంద్రబాబు జైల్లో వున్నారు. లోకేష్ వ్యవహారాలను అవగతం చేసుకుని, పరిస్థితిని తన కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు కిందా మీదా అవుతున్నారు. ఇలాంటి టైమ్ లో వున్నట్లుండి వ్యవహారాన్ని టర్న్ తిప్పారు.

ఓ ప్లాన్ ప్రకారం నిరసనలు ప్రారంభమయ్యాయి.

అదే సమయంలో దేశ వ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతు సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్ హుటాహుటిన రాజమండ్రి వెళ్లారు. కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఇలా ప్రకటించడానకి ముందు రోజే ఈ విషయం మీడియాకు పార్టీ వర్గాల ద్వారా లీక్ అయింది.

పవన్ ప్రకటన చేసిన వెంటనే ఉమ్మడి కార్యాచరణ్ కు సిద్దం అవుతున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే లోకేష్ బయల్దేరి ఢిల్లీ వెళ్లారు.

అమిత్ షా ను కలిసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కూడా అమిత్ షా కు చెబుతాం అన్నారు తప్ప మోడీకి చెబుతాం అనలెేదు. ఈ విషయం ఇక్కడ గమనార్హం.

మొత్తం మీద ఈ విధంగా మొత్తం వ్యవహారాన్ని ఓ క్రమంలో పెట్టడం వెనుక మాస్టర్ మైండ్ ఎవరిది? జైలు గది నుంచే చంద్రబాబు డైరక్షన్ ఇస్తున్నారా? అలా అంటే లేదు..కాదనే సమాచారం అందుతోంది.

చంద్రబాబు కన్నా ఎక్కువగా జగన్ పతనాన్ని కోరుకుంటున్న ఓ పెద్దాయిన ఈ వ్యవహారం అంతా తన కనుసన్నలలో నడిపిస్తున్నారని తెలస్తోంది. ఇప్పుడు ప్రో చంద్రబాబు ఉద్యమాన్ని నడిపించే బాధ్యతను ఆయనే తీసుకున్నారని తెలుస్తోంది. నాదెండ్ల టైమ్ లో తెర వెనుక నుంచి ఇలాంటి ఉద్యమాన్ని నడిపించిన అనుభవం వుంది. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు.

నిజానికి పవన్ ఇప్పటికిప్పుడు పొత్తు ప్రకటించనక్కరలేదు. ఎందుకంటే ఓట్లు చీలనివ్వను అని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు-పవన్ పదే పదే కలుస్తూనే వున్నారు. అందువల్ల ఈ రెండు పార్టీల పొత్తు తథ్యం అన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబును ఎలా బయటకు తీసుకురావాలా? జనాల్లో చంద్రబాబకు సింపతీ ఎలా పెంచాలా? నిరసన ఉద్యమాలు ఎలా నిర్వహించాలి అనే ఆలోచనలు సాగించాల్సిన టైమ్ లో పవన్ ఇలా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది?

సింపుల్ ఆన్సర్. చంద్రబాబు అరెస్ట్ తో తెలుగుదేశం క్యాడర్ కాస్త నిస్తేజానికి గురయింది. బంద్ పిలుపు ఇస్తే అది సక్సెస్ కాలేదు. అలాంటి టైమ్ లో క్యాడర్ కు ఉత్సాహం ఇవ్వాలి. నిరసన కార్యక్రమాలకు బలం చేకూర్చాలి. జనసేన దగ్గర ఇప్పుడు మాస్ మంది మార్బలం సమృద్దిగా వుంది. అది వాడుకొవాలి అంటే పొత్తు ప్రకటన అనివార్యం. పొత్తు ప్రకటన లేకుండా కలిసి నిరసన చేయడం కష్టం.

పవన్ కూడా అదే చెప్పారు. పొత్తు కన్నా ముందు ఉమ్మడి కార్యాచరణ కు రంగం సిద్దం చేస్తున్నామన్నారు. ఆపై రెండు వైపులా నాయకులను పొత్తుకు సిద్దం చేస్తామన్నారు. అంటే ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఒకటే. చంద్రబాబు అరెస్ట్..అక్రమం..అన్యాయం అని టముకు వేయడం.

జనాలను వైకాపాకు వ్యతిరేకంగా తిరుగుబాటు దిశగా నడిపించడం. ఇలాంటి ఐడియా బాబు మదిలోనో, లోకేష్ బుర్రలోనో, తెలుగుదేశం మేధోమధనంలోనో పుట్టలేదు. ఇది వేరే ‘సిటీ’లో కాకలు తీరిన యోధుడి బుర్రలో పుట్టింది. అక్కడి నుంచే డైరక్షన్ వస్తోంది. దానికి అనుగుణంగానే ఇక్కడ అందరూ జీవించేస్తున్నారు.