షాకింగ్: ఇంత ట్రోలింగ్ ఎప్పుడూ చూడలేదు

వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ వచ్చింది. అటు అర్జున్ రెడ్డి, ఇటు డియర్ కామ్రేడ్ సినిమాల్ని కలిపి కొట్టినట్టు కనిపించింది. అయితే ట్రోలింగ్ ఇక్కడితో ఆగలేదు. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా టీజర్…

వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ వచ్చింది. అటు అర్జున్ రెడ్డి, ఇటు డియర్ కామ్రేడ్ సినిమాల్ని కలిపి కొట్టినట్టు కనిపించింది. అయితే ట్రోలింగ్ ఇక్కడితో ఆగలేదు. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా టీజర్ ను నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. కొంతమంది సీరియస్ గా విమర్శిస్తుంటే.. మరికొందరు కామెడీగా పోస్టులు పెడుతున్నారు.

సెక్స్, సిగరెట్, మందు లాంటి ఎలిమెంట్స్ దాటి ముందుకు రాలేవా అంటూ విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. టీజర్ లో ఒక్కో ఫ్రేమ్ ను కట్ చేసి, ఇంతకుముందు విజయ్ నటించిన సినిమాల్లోని ఫొటోలతో మ్యాచ్ చేస్తున్నారు. మరోవైపు విజయ్ మేనరిజమ్స్ పై కూడా సీరియస్ కామెంట్స్ పడుతున్నాయి.

విజయ్ దేవరకొండ అర్జెంట్ గా తన లుక్, మేనరిజమ్స్ మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. రొటీన్ మేనరిజమ్స్, అవే లుక్స్ తో కనిపిస్తే ఎక్కువ సినిమాలు చేయలేవని, ఈ విషయంలో చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలని చాలామంది సూచిస్తున్నారు. చిరంజీవి లాంటి హీరో తన లుక్స్, మేనరిజమ్స్ ను ఎప్పటికప్పుడు మార్చుకోవడం వల్లనే టాప్ పొజిషన్ కు చేరుకున్నారని గుర్తుచేస్తున్నారు.

ఇక ఫన్నీ కామెంట్స్ విషయానికొస్తే.. టీజర్ లో విజయ్ దేవరకొండ పళ్లు తోముకుంటుంటే కాజల్ వచ్చి మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అని అడుగుతుంది. విజయ్ దేవరకొండ సీరియస్ గా చూస్తుంటే.. పక్కనే బాలయ్య ఫొటో పెట్టి “మామా ఏక్ పెగ్ లా” అనే కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి ఎన్నో ఫన్నీ పోస్టులు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ పై నడుస్తున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఈమధ్య కాలంలో ఏ టీజర్/ట్రయిలర్ పై ఈ స్థాయిలో ట్రోలింగ్ నడవలేదు. ఇది విజయ్ దేవరకొండపై ఉన్న క్రేజ్ అనుకోవాలా లేక టీజర్ రొటీన్ గా ఉందనే కోపం అనుకోవాలో అర్థం కావడం లేదు. అయితే ఒకటి మాత్రం నిజం. ఈ నెగెటివిటీ నుంచి సినిమాను పాజిటివ్ బజ్ వైపు తీసుకురావడం మాత్రం చాలా కష్టం.

70 ఏళ్ళు వచ్చినా హీరోగా చేస్తున్నా