డిస్కోరాజా..’హీరో టీజర్’ వస్తోంది

డిస్కోరాజా..రవితేజ-విఐ ఆనంద్ కాంబినేషన్ సినిమా. నిజానికి ఈ కాంబినేషన్ నే చిత్రమైనది. వైవిధ్యమైన సినిమాలు, సైంటిఫిక్ టచ్ వున్న సినిమాలు చేసే దర్శకుడు విఐ ఆనంద్. పక్కా మాస్ ఎంటర్ టైనర్లు అందిస్తాడు రవితేజ.…

డిస్కోరాజా..రవితేజ-విఐ ఆనంద్ కాంబినేషన్ సినిమా. నిజానికి ఈ కాంబినేషన్ నే చిత్రమైనది. వైవిధ్యమైన సినిమాలు, సైంటిఫిక్ టచ్ వున్న సినిమాలు చేసే దర్శకుడు విఐ ఆనంద్. పక్కా మాస్ ఎంటర్ టైనర్లు అందిస్తాడు రవితేజ. ఇలాంటి ఇధ్దరు కలిసి డిస్కోరాజా సినిమా చేస్తున్నారు. ఇది కూడా ఆనంద్ టైప్ సైంటిఫిక్ కాన్సెప్ట్ నే. ఆ విషయాన్నే తొలి టీజర్ లో చూపించేసారు.

కానీ రవితేజ మార్క్ మిస్ అయితే ఎలా? అందుకే సినిమాలో ఇద్దరు రవితేజలు వున్నారు. ఒకరు ఆనంద్ మార్క్ అయితే మరొకరు పక్కా రవితేజ మార్క్. ఇప్పుడు ఈ రెండో రవితేజను చూపించే టీజర్ వస్తోంది. ఈ టీజర్ లో రవితేజ మార్క్ ఎంటర్ టైన్ మెంట్, డైలాగ్ వుంటాయని తెలుస్తోంది. 

24న విడుదలయ్యే డిస్కోరాజా సినిమాకు టీజర్లను వరుసగా విడుదల చేసి, ఆపై ట్రయిలర్ ను చూపించి, బజ్ తేవాలని చూస్తోంది యూనిట్. రామ్ తాళ్లూరి నిర్మించే ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు.

70 ఏళ్ళు వచ్చినా హీరోగా చేస్తున్నా