అల వైకుంఠపురములో సినిమాకు రావాల్సిన బజ్ వచ్చేసింది. అందులో సందేహం లేదు. హారిక హాసిని స్వంతగా పెట్టుకున్న డిజిటల్ టీమ్ ఎఫెక్ట్ అది. బన్నీ డిజిటల్ టీమ్ కన్నా హారిక హాసిని డిజిటల్ టీమ్ వల్లనే వెబ్ మీడియాలో ఆ సినిమాకు బజ్ వచ్చిందన్నది ఓ చేదు వాస్తవం. అయితే ఎలా వచ్చినా క్రెడిట్ అందరూ పంచుకుంటున్నారు. ఓకె.
మరి సినిమా సంగతి పక్కన పెడితే బన్నీ కోసం ఆయన డిజిటల్ లేదా స్వంత టీమ్ ఏం చేస్తున్నారన్నది పాయింట్. మహేష్ సినిమా ఈవెంట్ 5న జరుగుతోంది. దీనికి విపరీతమైన బజ్ వుంది. కానీ బన్నీ సినిమా ఫంక్షన్ 6న జరుగుతోంది. దీనికి అంత బజ్ లేదు.
నిజానికి బజ్ రావాల్సింది ఫ్యాన్స్ లో. సోషల్ మీడియాలో వైరల్ కావాల్సింది ఫ్యాన్స్ ద్వారా. దీనికోసం కామన్ డీపీ, కామన్ విడియో బైట్ ఇలా చాలా చాలా చేయాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి వ్యవహారాలే లేవు. అటు మహేష్ కు సెపరేట్ గా ఓ టీమ్ మొత్తం ప్రచారం కోసం వర్క్ చేస్తోంది. అదే టీమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంది. కానీ ఆ విషయంలో బన్నీ టీమ్ కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు ఇంత దగ్గరకు వచ్చాక సమస్య గమనించి హారిక హాసిని సంస్థ ఫంక్షన్ విషయంలో కిందా మీదా అవుతోంది. రెండు రోజుల్లో ఫంక్షన్ పెట్టుకుని కిందా అయినా మీద అయినా చేసేదేముంది. అసలు ప్లానింగ్ నే లేనపుడు. ఫంక్షన్ విషయంలో మహేష్ సినిమాది ఇప్పటికే అప్పర్ హ్యాండ్ అయిపోయింది. ఇక వాళ్లదే ప్రాబ్లమ్ అని వీళ్లు, వీళ్లదే ప్రాబ్లమ్ అని వాళ్లు అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.