కళ్యాణ్ రామ్ చాలా మంచి వాడు. ఎంత మంచి వాడు అంటే, ఎవరింట్లో కష్టం వచ్చినా, వారింటి మనిషి అయిపోయేంత. అన్న, తమ్ముడు, కొడుకు, మామయ్య ఇలా ఏదో ఒక బంధుత్వం కలిపేసుకునేంత. అలాంటి మంచి వాడి సంగీత్ సంబంరం అంటే ఎలా వుంటుంది. అందులోనూ మెహరీన్ లాంటి జోడీ దొరికితే ఇంకెలా వుంటుంది. ఓ మాంచి పాట వేసుకోవడం తప్పదు కదా?
అందుకే మున్నార్ లాంటి మాంచి హిల్ స్టేషన్ కు వెళ్లిపోయి, రామజోగయ్య శాస్త్రి లాంటి మాంచి రైటర్ రాసిన సాంగ్ ను గోపీసుందర్ ట్యూన్ లో పాడేసుకున్నారు. ' ఓ చిన్నదాన..నీ నవ్వే చాలు..పద పలకరిద్దాం..ఓ చిన్నదాన నీ మాటే చాలు..బంధాలు అల్లుకుందాం' అంటూ. గమ్మత్తేమిటంటే సంగీత్ సాంగ్ లో కూడా ఈ 'మంచివాడు' బంధాలు అనుబంధాలు అంటూ పలవరించడం.
బహుశా అందుకే కావచ్చు, దర్శకుడు సతీష్ వేగ్నిశ తన సినిమాకు 'ఎంత మంచివాడవురా' అనే టైటిల్ పెట్టి వుంటారు. ఆదిత్య మూవీస్ పతాకంపై ఈ సినిమాను ఉమేష్ గుప్తా నిర్మిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణ భాగస్వామి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది.
నాన్నా నీది దోశ స్టెప్.. అల్లు అర్హ