ఓ మేజిక్ జరుగుతుంది.. అప్పుడు సినిమా హిట్

సినిమా చేస్తున్నప్పుడే ఓ రకమైన మేజిక్ జరుగుతుందని, అది మనసుకు తెలుస్తుందని అంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. అలా మేజిక్ జరిగిన సినిమాలు సూపర్ హిట్ అవుతాయని చెబుతున్నారు. అలాంటి మేజిక్ దర్బార్ సినిమా…

సినిమా చేస్తున్నప్పుడే ఓ రకమైన మేజిక్ జరుగుతుందని, అది మనసుకు తెలుస్తుందని అంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. అలా మేజిక్ జరిగిన సినిమాలు సూపర్ హిట్ అవుతాయని చెబుతున్నారు. అలాంటి మేజిక్ దర్బార్ సినిమా విషయంలో జరిగిందని చెబుతున్నారు.

అంద‌రూ సినిమా బాగా హిట్ కావాల‌నే చేస్తారు. అయితే సినిమా చేసే స‌మ‌యంలో ఓ మ్యాజిక్ జ‌రుగుతుంది. ఆ మ్యాజిక్ మ‌న చేతుల్లో ఉండ‌దు. అలాంటి మ్యాజిక్ ఈ దర్బార్ సినిమాకు జ‌రిగింది.”

తను చేసిన భాషా, ముత్తు, పెద‌రాయుడు, న‌ర‌సింహ‌, చంద్ర‌ముఖి, రోబో సినిమాలు కేవ‌లం తన వల్ల ఆడలేదంటున్నారు రజనీ. అవన్నీ మంచి సినిమాలని, అందులో తను కూడా ఓ భాగమని చెబుతున్నారు. దర్బార్ సినిమా కూడా అలాంటిదే అంటున్నారు.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో రాత్రి గ్రాండ్ గా జరిగింది. గత అనుభవాల దృష్ట్యా ఈ ఫంక్షన్ కు రజనీకాంత్ రాడని అంతా అనుకున్నారు. వస్తాడంటూ ఊరించి ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారని మీడియా భావించింది. కానీ రజనీకాంత్ రాకతో దర్బార్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కళ వచ్చింది.

త‌క్కువగా ఆశ ప‌డండి…త‌క్కువగా మాట్టాడండి