అచ్చెన్న వచ్చారు.. పాపం లోకేష్ పరిస్థితేంటి?

ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అచ్చెన్నాయుడికి కట్టబెట్టిన సందర్భంలో.. నారా లోకేష్ అలిగాడని తెలుస్తోంది. గతంలోనే అచ్చెన్న పేరు తెరపైకి వచ్చినా.. లోకేష్ అడ్డుపడటం వల్లే ప్రకటన రాలేదని అనుకున్నారు. Advertisement మరి అర్థాంతరంగా…

ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అచ్చెన్నాయుడికి కట్టబెట్టిన సందర్భంలో.. నారా లోకేష్ అలిగాడని తెలుస్తోంది. గతంలోనే అచ్చెన్న పేరు తెరపైకి వచ్చినా.. లోకేష్ అడ్డుపడటం వల్లే ప్రకటన రాలేదని అనుకున్నారు.

మరి అర్థాంతరంగా ఇప్పుడు అచ్చెన్నాయుడి పేరుని ప్రకటించడం వెనక అసలు కారణం ఏంటా అని టీడీపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు లోకేష్ ని బుజ్జగించారని అర్థమవుతోంది.

అచ్చెన్నాయుడు దూకుడు మరీ ఎక్కువైతే.. తనకు ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతోటే.. లోకేష్.. ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో కాస్త పట్టుబట్టారు. దీంతో చంద్రబాబు కూడా చేసేదేంలేక ప్రకటన వాయిదా వేసుకున్నారు. ఈలోగా ఒకరిద్దరు పేర్లు తెరపైకి వచ్చినా.. అటు అచ్చెన్నను సముదాయించడం మాత్రం చంద్రబాబుకి వల్ల కాలేదు. 

ఎర్రన్నాయుడి కుమార్తె ఆదిరెడ్డి భవానీ పార్టీ మారబోతున్నట్టు టీడీపీ వద్ద సమాచారం ఉంది, రామ్మోహన్ నాయుడు కూడా లోకేష్ విషయంలో గతంలో చాలా ఇబ్బంది పడ్డారు, ఆయన అసంతృప్తి ఉండనే ఉంది.

ఇక లోకేష్ ని సేవ్ చేసేందుకు అచ్చెన్నాయుడు జైలుకి సైతం వెళ్లేందుకు సిద్ధపడ్డారు. బాబు తెలివిగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి.. కటకటాల్లోకి వెళ్లకుండానే ఆస్పత్రినుంచి కరోనా పేరు చెప్పి అచ్చెన్నాయుడుని ఇంటికి పంపించేయగలిగారు. సో.. ఇప్పుడు అచ్చెన్నాయుడి త్యాగానికి ప్రతిఫలం ఇవ్వాలి. లేకపోతే ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు.. పార్టీకి దక్కకుండా పోయే ప్రమాదం ఉంది.

ఇప్పటికిప్పుడు వైసీపీలోకి వెళ్తామని చెప్పకపోయినా.. టీడీపీ వ్యవహారాలకు మాత్రం దూరంగా ఉంటామనే సందేశాన్ని కింజరపు కుటుంబం చంద్రబాబుకి చేరవేసింది. దీంతో చేసేదేం లేక.. చివరకు చినబాబునే బుజ్జగించుకున్నారు చంద్రబాబు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి వాందర్నీ వాడుకోవాలని, అధికారంలోకి వచ్చాక, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయని చంద్రబాబు లోకేష్ కి ఉపదేశించి ఉంటారు. దీంతో అయిష్టంగానే అచ్చెన్న అజమాయిషీని లోకేష్ ఒప్పుకున్నారు.

తాజా నియామకంతో ఏపీ టీడీపీలో ఇప్పుడు రెండు కోటరీలు ఏర్పడ్డాయి. ఒకటి లోకేష్ గ్రూప్ కాగా, రెండోది అచ్చెన్నాయుడు గ్రూప్. అచ్చెన్నాయుడుతో తమకు సంబంధం లేదని, లోకేష్ ఆదేశానుసారం మా పనులు మేం చేసుకుపోతామంటూ ఇప్పటికే ఓ వర్గం చెప్పుకొస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడి పెత్తనం ఆ కోటరీపై ఉండకూడదని ఓ పెద్ద మనుషుల ఒప్పందం కూడా జరిగిపోయిందట. 

అయితే అచ్చెన్న మాత్రం కళా వెంకట్రావులా రబ్బర్ స్టాంప్ గా ఉండిపోయే రకం కాదు. చూస్తుంటే.. రాబోయే రోజుల్లో లోకేష్-అచ్చెన్న వర్గాల మధ్య అంతర్యుద్ధం గట్టిగా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జగన్ వ్యూహం.. కూలుతున్న టీడీపీ కోట