Advertisement

Advertisement


Home > Movies - Movie News

చిరంజీవి కోసం 'సీఎం కథ' రాసిన వినాయక్

చిరంజీవి కోసం 'సీఎం కథ' రాసిన వినాయక్

అవకాశం ఒక్కసారే వస్తుంది, దాన్ని అందిపుచ్చుకున్నోడే అదృష్టవంతుడు. దర్శకుడు వీవీ వినాయక్ కు కూడా అలాంటి అవకాశం ఒకేసారి వచ్చింది. దాన్ని అతడు ఒడిసి పట్టుకున్నాడు. అదే ఠాగూర్ సినిమా. ఆ రీమేక్ సినిమా కోసం, తను చిరంజీవి కోసం రాసుకున్న సొంత కథను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు వినాయక్.

"రాజారవీంద్ర వచ్చి నన్ను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడు. ఫస్ట్ టైమ్ చిరంజీవిని కలవడం అదే. కాసేపు మాట్లాడిన తర్వాత రమణ సినిమా చూశారా అని అడిగారు. చూశానని చెప్పాను. నాకు బాగుంటుందా అని అడిగారు. అదిరిపోతుందని చెప్పాను. 

కాకపోతే క్లైమాక్స్ మార్చాలని చెప్పాను. ఎలా మారుస్తావని అడిగారు. చిరంజీవి సీఎం అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో అప్పటికే ఓ కథ రాశాను. ఆ కథ క్లైమాక్స్ లోని కొన్ని సీన్లు, డైలాగ్స్ రమణ రీమేక్ కోసం చెప్పాను. అది చిరంజీవి గారికి బాగా నచ్చింది. అలా 4 సిట్టింగ్స్ తర్వాత ఠాగూర్ మూవీ ఓకే అయింది."

ఇలా చిరంజీవి కోసం రాసుకున్న "ముఖ్యమంత్రి కథ"ను ఠాగూర్ సినిమాలో కలిపేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు వినాయక్.

ఇక ఇప్పుడున్న హీరోలపై స్పందిస్తూ.. మహేష్, పవన్ కల్యాణ్ తో మాత్రం సినిమాలు చేయలేకపోయానని చెప్పిన వినాయక్.. ఏదో ఒక టైమ్ లో సడెన్ గా సినిమా సెట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశాడు.

ఇలాంటి వింతలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?