మంచివాడు మా బాబాయ్…అబ్బాయి పొగడ్తలు

బాబాయ్ అబ్బాయ్ ల మధ్యన ఎపుడూ గమ్మత్తైన రిలేషన్ షిప్ ఉంటుంది. తండ్రి దగ్గర బెరుకు ఉన్నా బాబాయ్ వద్ద మాత్రం స్నేహితుడితో ఉన్న చనువు ఉంటుంది. ఇక సినీ రంగాన, రాజకీయాలలో ఈ…

బాబాయ్ అబ్బాయ్ ల మధ్యన ఎపుడూ గమ్మత్తైన రిలేషన్ షిప్ ఉంటుంది. తండ్రి దగ్గర బెరుకు ఉన్నా బాబాయ్ వద్ద మాత్రం స్నేహితుడితో ఉన్న చనువు ఉంటుంది. ఇక సినీ రంగాన, రాజకీయాలలో ఈ జంటలకు కొదవలేదు.

ఏపీ రాజకీయాల్లో బాబాయ్ అబ్బాయ్ అంటే కింజరాపు ఫ్యామిలీనే చెప్పుకుంటారు. ఎర్రన్నాయుడు వారసుడిగా అచ్చెన్నాయుడే ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎనిమిదేళ్ళ క్రితం రామ్మోహననాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు. ఇద్దరూ కూడా టీడీపీకి గట్టి నేతలుగానే ఉన్నారు.

ఇపుడు అచ్చెన్నను ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా చంద్రబాబు చేశారు. దాంతో అబ్బాయి రామ్మోహన్నాయుడు పొగడ్తల‌ వర్షం కురిపించేస్తున్నారు. మా బాబాయ్ గొప్ప ధైర్యవంతుడు, ఎవరికీ ఎపుడూ భయపడే రకం కాదు అంటూ కితాబులు ఇస్తున్నాడు. ఆయన నాయకత్వంలో అంతా కలసికట్టుగా పనిచేస్తామని కూడా చెబుతున్నాడు.

నిజానికి ఈ పదవికి మొదట రామ్మోహన్ నే అనుకున్నారు. అది మిస్ అయినా మళ్ళీ కింజరాపు వారి ఇంటనే పదవి వచ్చి వరించింది. ఇక రామ్మోహన్ కి కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. అంటే టీడీపీ, చంద్రబాబు ఈ ఫ్యామిలీ మీద ఎంతలా ఆధారపడుతున్నారో అన్న చర్చ కూడా పార్టీలో  ఉంది. ఏది ఏమైనా  అచ్చెన్న బాబాయ్ భయపడడు అని అబ్బాయ్ అంటున్నాడు. మరి ఎవరిని భయ‌పెడతారో చూడాలి.

ఈ విష‌యంలో సీజేఐ మౌనాన్ని వీడ‌టం మంచిది

ఇలాంటి వింతలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో?