సినిమా జనాల విరాళాలు

హైదరాబాద్ వరదల విలయతాండవం నేపథ్యంలో సినిమాజనం స్పందించడం ప్రారంభించారు. ఈ రోజు  ఉదయం నాగార్జున 50 లక్షల విరాళం ప్రకటించడంతోనే అర్థమైంది. ఈ రోజు ఈ విరాళాల తాకిడి వుంటుందని. ఆ వెంటనే చకచకా…

హైదరాబాద్ వరదల విలయతాండవం నేపథ్యంలో సినిమాజనం స్పందించడం ప్రారంభించారు. ఈ రోజు  ఉదయం నాగార్జున 50 లక్షల విరాళం ప్రకటించడంతోనే అర్థమైంది. ఈ రోజు ఈ విరాళాల తాకిడి వుంటుందని. ఆ వెంటనే చకచకా అందరూ ప్రకటించడం ప్రారంభించారు.

మహేష్ బాబు తన స్థాయికి తగినట్లు కోటి రూపాయలు ప్రకటించారు. అంతే మొత్తం తాను కూడా ప్రకటించి మెగాస్టార్ అనిపించుకున్నారు చిరంజీవి. ఎన్టీఆర్ కూడా యాభై లక్షలు ప్రకటించారు. డైరక్టర్ త్రివిక్రమ్ 10 లక్షలు, హారిక హాసిన సంస్ధ 10 లక్షల అందించారు. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ అయిదేసి లక్షల వంతున తమ సాయం ప్రకటించారు.

సాయంత్రానికి ఇంకా చాలా మంది విరాళాలు వస్తాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి టాప్ హీరొలు, గీతా, మైత్రీ, దిల్ రాజు లాంటి పెద్ద బ్యానర్ల నుంచి ఇంకా ప్రకటనలు రావాల్సి వుంది. మొత్తానికి ఇండస్ట్రీ అంతటి నుంచి కలిసి ఓ పది కోట్ల వరకు వచ్చే అవకాశం వుంది.

ఈ విష‌యంలో సీజేఐ మౌనాన్ని వీడ‌టం మంచిది