సర్జరీ పూర్తి.. విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్

మోకాలి శస్త్రచికిత్స కోసం ప్రభాస్ యూరోప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. ప్రస్తుతం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దాదాపు అక్టోబర్ మొత్తం ఆయన రెస్ట్ తీసుకునే అవకాశం…

మోకాలి శస్త్రచికిత్స కోసం ప్రభాస్ యూరోప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. ప్రస్తుతం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దాదాపు అక్టోబర్ మొత్తం ఆయన రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. నవంబర్ నుంచి తిరిగి సెట్స్ పైకి రావొచ్చు.

కొన్నాళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ ప్రమోషన్స్ టైమ్ లో ప్రభాస్ వాకింగ్ స్టయిల్ చూసి, అతడి అభిమానులు చాలా బాధపడ్డారు. అప్పట్నుంచి గాయంతోనే షూటింగ్స్ లో పాల్గొంటూ వచ్చాడు. ఎట్టకేలకు సలార్ సినిమా షూటింగ్ పూర్తిచేసిన తర్వాత ఆయన సర్జరీ చేయించుకున్నాడు.

ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత కల్కి, మారుతి సినిమాల్ని ప్రభాస్ తిరిగి సెట్స్ పైకి తీసుకొస్తాడు. వీటిలో కల్కి సినిమాకు ఎక్కువగా టైమ్ కేటాయించబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత, మరో 2 సినిమాల్ని సైమల్టేనియస్ గా సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను స్టార్ట్ చేస్తాడు. అదే టైమ్ లో హను రాఘవపూడి సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. అయితే 2024 సమ్మర్ తర్వాతే ఈ సినిమా పట్టాలపైకి వస్తుంది.

సర్జరీ కూడా పూర్తవ్వడంతో, ప్రభాస్ పెళ్లి టాపిక్ మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది పూర్తిగా కోలుకొని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటాడని చాలామంది ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు.