వైఎస్సార్ తరువాత జగన్… బాబువి రిక్త హస్తాలే…!

ఏపీలో అన్ని వర్గాల సంక్షేమం చూసేంది ముఖ్యమంత్రి జగనే అని అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షుదు ద్రోణం రాజు రవికుమార్ అన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి పెద్ద పీట వేసింది గతంలో వైఎస్సార్ అయితే…

ఏపీలో అన్ని వర్గాల సంక్షేమం చూసేంది ముఖ్యమంత్రి జగనే అని అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షుదు ద్రోణం రాజు రవికుమార్ అన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి పెద్ద పీట వేసింది గతంలో వైఎస్సార్ అయితే ఇపుడు జగన్ మాత్రమే అని ఆయన అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు రిక్త హస్తాలే చూపించారు అని ఆయన విమర్శించారు.

ఒకనాడు చట్టసభలలో ముప్పయి మూడు మంది ఎమ్మెల్యేలు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారని ఇపుడు ఆ సంఖ్య మూడుకు పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయంలో చూసుకుంటే అపుడెపుడో దశాబ్దాల క్రితం కరణం రామచంద్రరావు ఉండేవారని, ఆయన తరువాత బ్రాహ్మణులకు టికెట్ ఇచ్చిన చరిత్ర టీడీపీకి లేదని అన్నారు.

గతంలో వైఎస్సార్ అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు, రెండు ఎమ్మెల్సీ, ఒక ఎంపీ స్థానాన్ని బ్రాహ్మణులకు కేటాయించారని ద్రోణం రాజు రవికుమార్ గుర్తు చేశారు. ఇపుడు జగన్ పుణ్యమాని చట్టసభలలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే మరో ఎమ్మెల్సీ టికెట్ కూడా తమకు ఇచ్చారని ఆయన అంటూ జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.

ఇకపోతే చట్టసభలలో బ్రాహ్మణుల ఉనికి లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం అని తాను కచ్చితంగా చెప్పగలనని రవికుమార్ అన్నారు. ఆ విధంగా రాజకీయంగా తమ సామాజికవర్గానికి కోలుకోలేని దెబ్బ కొట్టిన పార్టీ టీడీపీ అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు తమ సామాజిక వర్గం పట్ల చిన్న చూపు చూశారని విమర్శించారు.