రాజ‌ధాని ఉద్య‌మానికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌…క‌మ్మే

రాజ‌ధాని ప్రాంతం ఒక సామాజిక వ‌ర్గానికి చెందింద‌ని ముద్ర‌వేసి అమ‌రావ‌తిని చంపేయాల‌ని సీఎం జ‌గ‌న్ కుట్ర ప‌న్నార‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఎల్లో మీడియా ప‌దేప‌దే ఆరోపిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాంతంలో 75…

రాజ‌ధాని ప్రాంతం ఒక సామాజిక వ‌ర్గానికి చెందింద‌ని ముద్ర‌వేసి అమ‌రావ‌తిని చంపేయాల‌ని సీఎం జ‌గ‌న్ కుట్ర ప‌న్నార‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఎల్లో మీడియా ప‌దేప‌దే ఆరోపిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాంతంలో 75 శాతం క‌మ్మేత‌ర సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారున్నార‌ని చంద్ర‌బాబు నిన్న‌టి రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌లో కూడా చెప్పారు.

బాబు అండ్ కో ఆరోప‌ణ‌లు, వివ‌ర‌ణ‌లు ఎలా ఉన్నా ఆ 29 గ్రామాల ఆందోళ‌న‌ల‌కు ఆర్థిక అండ‌దండ‌లు ఇస్తున్న వారెవ‌రో తెలుసుకుంటూ చాలు…అక్క‌డ ఎవ‌రున్నారో తెలిసిపోతుంది. ఆ ఉద్య‌మ విరాళాల వివ‌రాల‌ను ఆంధ్ర‌జ్యోతి గొప్ప‌గా ప్ర‌క‌టించి…పాల‌క ప‌క్షం చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు బ‌లం ఇచ్చింది. అది ముమ్మాటికీ క‌మ్మ సామాజిక రియ‌ల్ ఎస్టేట్ ఉద్య‌మ‌మ‌ని పాల‌క పార్టీ నేత‌లు ప‌దేప‌దే విమ‌ర్శిస్తున్నారు.

రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నారా భువ‌నేశ్వ‌రి రైతుల ఉద్య‌మానికి త‌న వంతుగా రెండు బంగారు గాజుల విరాళంతో సాయానికి శ్రీ‌కారం చుట్టారు. ఆ త‌ర్వాత మ‌రికొంద‌రు విరాళాలు ఇవ్వ‌డానికి ముందుకొచ్చారు. రాజ‌ధాని ఉద్య‌మానికి ‘క‌మ్మ‌’ విరాళాలు మాత్ర‌మే పోటెత్తాయి.

నారా భువనేశ్వరి చౌదరి 2 బంగారు గాజులు,  చంద్ర‌బాబునాయుడు రూ.ల‌క్ష‌, విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చౌదరి  రూ.లక్ష , NRI బుచ్చిబాబు చౌదరి రూ. 50 వేలు, మాజీ ఎమ్మెల్యే హనుమంత రాయ చౌదరి రూ. లక్ష, క‌నిగిరి వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ మాజీ చైర్మ‌న్ దారపనేని చంద్రశేఖర్ చౌదరి రూ.50 వేలు, గుంటూరు టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు GV ఆంజనేయులు చౌదరి రూ.10 వేలు చొప్పున విరాళాలు ఇచ్చారు.

రాజ‌ధాని ఉద్య‌మానికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌…అన్నీ క‌మ్మ సామాజిక‌వ‌ర్గీయులే అనేందుకు ఇంత‌కంటే నిద‌ర్శ‌నం కావాలి. చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టు అక్క‌డ ఇత‌ర సామాజిక‌వ‌ర్గాల‌కు సంబంధించి 75 శాతం మంది ఉంటే..వారెందుకు ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వ‌లేదో చెప్పాలి.