వెనకటికి ఎవడో లేవలేనివాడు, ఆ విషయం దాచి, తాను లేస్తే మనిషిని కాదు అన్నాట్ట. అలాగ్గా వుంది. కాంగ్రెస్ వ్యవహారం. సినిమా నటులు అంతా అర్జెంట్ గా మూడు రాజధానుల వ్యవహారం మీద స్పందించి, తమ వైఖరి చెప్పకపోతే, సంక్రాంతి టైమ్ లో మూడు రోజులు థియేటర్ల బంద్ చేయిస్తామంటూ అల్టిమేటమ్ జారీ చేసింది.
అసలు రాజధాని విషయంలో కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందో, చేయకూడనిదో, తనకంటూ ఒక మార్గం పెట్టి చేస్తున్నది కనిపించడం లేదు. ఆ మధ్య జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం మినహా కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు. చేయగలిగిందీ లేదు. అలాంటిది ఉరిమి ఉరిమి..అన్నట్లుగా సినిమా హీరోలు స్పందించాలనే డిమాండ్ చేయడం భలే ఫన్నీగా వుంది.
ముందుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి కాంగ్రెస్ పెద్దలు ఈ విషయలో తమ అభిప్రాయం స్పష్టంగా చెప్పాల్సి వుంది. సినిమా హీరోలు తమ ఒపీనియన్ చెబితే ఎంత చెప్పకపోతే ఎంత? అయినా ఇప్పటికే సినిమా హీరోల్లో సీనియర్ అయిన మెగాస్టార్ చిరంజీవి చెప్పేసారు. మరో సినిమా హీరో కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ తన బాటలో తను వున్నారు.
ఇక మిగిలిన వారు చెబితే ఏమిటి? చెప్పకుంటే ఏమిటి? అయినా కాంగ్రెస్ పార్టీ అల్టిమేటమ్ ఇస్తే స్పందించేవారు ఎవరు? ఆ పార్టీలో వున్న (ఇప్పటి వరకు) మెగాస్టార్ నే అనుకూలంగా లేరు. ఆ సంగతి అలా వుంచితే కాంగ్రెస్ పార్టీ అల్టిమేటమ్ ఇస్తే, బంద్ చేయడానికి సిద్దంగా వున్నది ఎవరు? బంద్ చేయించేది ఎవరు?
రాజధాని విషయంలో తెలుగుదేశం, జనసేన మాత్రమే కాదు, తాము కూడా వున్నాము అని చెప్పుకోవడానికి, అది విని జనం బెస్ట్ జోక్ అని అనుకోవడానికి తప్ప మరెందుకు పనికి రాదు.
టైటానిక్ సినిమా గుర్తుకు చేసారు చిరు అండ్ మోహన్ బాబు