రాజ‌శేఖ‌ర్ త‌ప్పిదానికి జీవిత క్ష‌మాప‌ణ‌లు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా)లో త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరుకు జీవిత క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ‘మా’  డైరీ విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం ఓ చిన్న అల‌జ‌డికి వేదికైంది. రాజ‌శేఖ‌ర్ చిన్న‌పిల్లాడు లాంటి వాడ‌ని,…

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా)లో త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరుకు జీవిత క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ‘మా’  డైరీ విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం ఓ చిన్న అల‌జ‌డికి వేదికైంది. రాజ‌శేఖ‌ర్ చిన్న‌పిల్లాడు లాంటి వాడ‌ని, ఆయ‌న అలా మాట్లాడినందుకు తాను క్ష‌మాప‌ణ‌లు చెప్పి న‌టి జీవిత హూందాత‌నాన్ని చాటుకున్నారు.

‘మా’లో విభేదాలు దాస్తే దాగేవి కాద‌ని, నిప్పును క‌ప్పి పుచ్చిన‌ట్టు త‌ప్పుల‌ను దాస్తే ప్ర‌యోజ‌నం ఏంట‌ని రాజ‌శేఖ‌ర్ ప్ర‌శ్నించి వివాదానికి తెర‌లేపిన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతున్న స‌మ‌యంలో రాజ‌శేఖ‌ర్ జోక్యం చేసుకున్నారు. దీంతో చిరంజీవి నొచ్చుకున్నారు. మంచి ఉంటే మైకులో చెప్పాల‌ని , చెడు ఉంటే చెవిలో చెప్పాల‌ని చిరంజీవి సూచించినా రాజ‌శేఖ‌ర్ వినిపించుకోలేదు.

ఈ నేప‌థ్యంలో ‘మా’ డైరీ కార్య‌క్ర‌మం వారిలో విభేదాలను బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్థం చేసుకున్న జీవిత వేదిక‌పైకి వెళ్లి మాట్లాడారు. ‘మా’ స‌భ్యురాలిగా చేరిన‌ప్ప‌టి నుంచి తాను ఎన్నో నేర్చుకున్నాన‌న్నారు. ఎంతో మంది గొప్ప న‌టీన‌టుల వ‌ల్లే తాను ఎన్నో విష‌యాలు నేర్చుకున్న‌ట్టు ఆమె తెలిపారు. మాలో గొడ‌వ‌లు స‌హ‌జ‌మ‌న్నారు. తాను, త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్ ‘మా’ను మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌నుకున్న‌ట్టు జీవిత తెలిపారు.

రాజ‌శేఖ‌ర్‌ది చిన్న‌పిల్ల‌ల మ‌న‌స్త‌త్వ‌మ‌ని, ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న అలా మాట్లాడినందుకు తాను చింతిస్తున్నాన‌ని, క్ష‌మించాల‌ని అంద‌రి స‌మ‌క్షంలో కోరారు. న‌రేష్‌, రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. భ‌విష్య‌త్‌లో కూడా తామంతా క‌లిసే ప‌నిచేయాల‌ని కోరుకుంటున్న‌ట్టు జీవిత చెప్పారు. దీంతో వివాదానికి ముగింపు ప‌లికిన‌ట్టే అనుకోవ‌చ్చు.

చిరు vs రాజశేఖర్