మరోసారి డ్యూయల్ రోల్ లో రవితేజ

తన సినిమాల్లో డిఫరెంట్ షేడ్స్ చూపిస్తుంటాడు రవితేజ. ఒకే హీరో రెండు మూడు రకాలుగా ప్రవర్తించడం అన్నమాట. అమర్-అక్బర్-ఆంటోనీ, కిక్, బలుపు, పవర్, లాంటి సినిమాల్లో రవితేజలో ఈ యాంగిల్ చూడొచ్చు. ఈ క్రమంలో…

తన సినిమాల్లో డిఫరెంట్ షేడ్స్ చూపిస్తుంటాడు రవితేజ. ఒకే హీరో రెండు మూడు రకాలుగా ప్రవర్తించడం అన్నమాట. అమర్-అక్బర్-ఆంటోనీ, కిక్, బలుపు, పవర్, లాంటి సినిమాల్లో రవితేజలో ఈ యాంగిల్ చూడొచ్చు. ఈ క్రమంలో డ్యూయల్ రోల్స్ కు దూరమయ్యాడు ఈ సీనియర్ హీరో. మళ్లీ ఇన్నేళ్లకు రవితేజకు ద్విపాత్రాభినయం చేసే ఛాన్స్ వచ్చింది.

అవును.. తన నెక్ట్స్ మూవీలో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ఖిలాడీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు “ప్లే స్మార్ట్” అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అంటే ఇందులో హీరో మాస్ గా కాకుండా స్మార్ట్ గా కనిపిస్తాడన్నమాట.

తమిళ్ లో సూపర్ హిట్టయిన ఓ సినిమా స్ఫూర్తితో ఈ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. సినిమా ఎనౌన్స్ మెంట్ తో పాటు హీరోయిన్ల పేర్లను కూడా ఒకేసారి ప్రకటించారు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించబోతున్నారు.

సుశాంత్ నటిస్తున్న ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది మీనాక్షి చౌదరి. ఖిలాడీ సినిమా ఆమెకు రెండోది.

ప్రస్తుతం క్రాక్ సినిమా పనిలో ఉన్న రవితేజ, వచ్చే నెల నుంచి ఖిలాడీని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.  

దేశం దృష్టిలో ఇప్పుడు జగన్ ఒక హీరో