మహేష్ బాబు ఇంటికి పోటీగా పవన్ కల్యాణ్ ఇల్లు

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ ఇంటి సెట్ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందులోనే షూటింగ్ జరుగుతోంది. ఇదిలా…

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ ఇంటి సెట్ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందులోనే షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు మరో హీరో కోసం కూడా ఓ ఇల్లు రూపుదిద్దుకుంటోంది.

త్వరలోనే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్ కల్యాణ్. ఈ సినిమా కోసం కూడా ఓ భారీ ఇంటి సెట్ నిర్మిస్తున్నారు. ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో ఈ సెట్ ను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

మహేష్ బాబు సినిమాకు ఆ ఇంటి సెట్ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాకు కూడా తాజాగా నిర్మిస్తున్న ఇల్లు సెట్ అంతే కీలకం అంటున్నారు. మ్యాగ్జిమమ్ సినిమా షూటింగ్ ఈ ఇంటి సెట్ లోనే చేయబోతున్నారు.

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. పవన్-హరీశ్ శంకర్ సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

తేరి సినిమాకు రీమేక్ గా వస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్. విజయ్ హీరోగా నటించిన ఆ తమిళ సినిమా చూసినవాళ్లకు ఎవరికైనా ఇంటిసెట్ ఎంత కీలకమో ఈజీగా అర్థమౌతుంది. సో.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా ఆనంద్ సాయి డిజైన్ చేస్తున్న ఇంటి సెట్ కీలకంగా మారనుంది.