నీయ‌మ్మ మొగుడు అంటావా…రెచ్చిపోయిన త‌మ్మారెడ్డి!

త‌న‌ను నీయ‌మ్మ మొగుడంటూ మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు దూషించ‌డంపై నిర్మాత‌, ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఘాటుగా స్పందించారు. త్రిబుల్ ఆర్ సినిమాకు సంబంధించి త‌మ్మారెడ్డి ఏదో అన్నార‌ని నాగ‌బాబు, ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు ఘాటు వ్యాఖ్య‌లు…

త‌న‌ను నీయ‌మ్మ మొగుడంటూ మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు దూషించ‌డంపై నిర్మాత‌, ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఘాటుగా స్పందించారు. త్రిబుల్ ఆర్ సినిమాకు సంబంధించి త‌మ్మారెడ్డి ఏదో అన్నార‌ని నాగ‌బాబు, ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. త‌మ్మారెడ్డి కామెంట్స్‌పై ఏవైనా అభ్యంత‌రాలుంటే ఆ విష‌య‌మై ప్ర‌శ్నించ‌డానికి, విమ‌ర్శించ‌డానికి ఓ ప‌ద్ధ‌తి, సంస్కార‌వంత‌మైన భాష వుంటుంది.

ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు క‌నీసం సంస్కారమైన భాష‌లో ప్ర‌శ్నించారు. మిత్రుడు భ‌ర‌ద్వాజ్ అంటూ సున్నితంగా తన మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టారు. కానీ నాగ‌బాబు తీవ్ర అభ్యంత‌ర‌క‌ర‌, కుసంస్కార రీతిలో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటో మ‌రోసారి చెప్పుకుని, దానిపై త‌మ్మారెడ్డి స్పంద‌న తెలుసుకుందాం.

'నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు ఆర్ఆర్ఆర్‌కి ఆస్కార్ కోసం (ఆర్ఆర్ఆర్ మీద చేసిన‌ కామెంటుకు వైసీపీ వారి భాషలో సమాధానం)' అంటూ నాగ‌బాబు ట్వీట్ చేశారు. త‌మ్మారెడ్డి వ‌య‌సు 75 ఏళ్లు. అలాంటి పెద్దాయ‌న్ను ప‌ట్టుకుని నాగ‌బాబు 'రా' అని సంబోధించ‌డం అంటే ఎంత కండ‌కావ‌ర‌మో అర్థం చేసుకోవ‌చ్చు. రాఘ‌వేంద్ర‌రావు, నాగ‌బాబు ట్వీట్ల‌పై త‌మ్మారెడ్డి ఘాటు స్పంద‌న‌ను ఆయ‌న మాట‌ల్లోనే తెలుసుకుందాం.

“మొద‌ట నేను త‌ప్పు చేయ‌లేదు. మూడు గంట‌ల సెమినార్‌లో చాలా విష‌యాలు మాట్లాడాం. త్రిబుల్ ఆర్ సినిమా భార‌త‌దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ఈ ఇష్యూకు రెండు రోజులు ముందు చెప్పాను. రాజ‌మౌళి గారికి హ్యాట్పాప్ చెప్పాను. అది ఎవ‌రు చూశారో తెలియ‌దు.

నీయ‌మ్మ మొగుడు అంటాడొక‌డు. నా అమ్మ మొగుడు నాకు మ‌ర్యాద నేర్పించాడు. నాకు సంస్కారం నేర్పించాడు. నాకు నీతిగా బ‌త‌క‌డం నేర్పించాడు. నిజం చెప్ప‌డం నేర్పించాడు. నిజం చెప్పి, నిజంగా బ‌త‌క‌డం నేర్పించాడు. మీకు నేర్పించారా? మీకు తెలుసా? నిజ‌మే చెప్ప‌గ‌ల‌రా మీరు?  మీరు చేసిన నిజాలేంటో చెబుతారా?  కులాలు, మ‌తాలనే మీరా నా గురించి మాట్లాడేది?  మాట్లాడేందుకు మీకు హ‌క్కుందా?  ఏమైనా మాట్లాడానికి సంస్కారం అడ్డొస్తోంది. నేనూ చాలా బూతులు మాట్లాడొచ్చు. లేనివాళ్ల గురించి మాట్లాడుతున్నారా మీరు?  ఏం మాట్లాడుతున్నారు?  దేని గురించి మాట్లాడుతున్నారు? అస‌లు నేను ఏం మాట్లాడాను.

ఎవ‌డో ఏదో ఒక ముక్క క‌ట్ చేసి పెడితే, దానిపై ట్వీట్ చేసి తిడితే అయిపోయిందా? ఇలాంటి వాటి వ‌ల్ల నాకేం కాదు. నిన్న రాత్రి నుంచి నేను సెల‌బ్రిటీ అయిపోయాను. తిట్టినందుకు మీరు సిగ్గుప‌డాలి. నేనేం త‌ప్పు చేయ‌లేదు. నేను నోరు విప్పితే చాలా వుంటాయి. విప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇంత‌కాలం మ‌న‌మంతా ఒక్క‌టే అని ఫీల్ అయ్యాను. ఇప్పుడూ ఫీల్ అవుతున్నా. మీకు సిగ్గు లేక‌పోతే నాకు సిగ్గు లేకుండా ఉండ‌లేను. నాకు సిగ్గు, మానం, అభిమానం అన్నీ వున్నాయి.

చిన్న సినిమా కోసం స‌మ‌యాన్ని వెచ్చించే స‌మ‌యం మీకుందా? ఎంత సేపూ వారికీ, వీరికి మ‌ర్ద‌న చేయ‌డానికే మీకు స‌రిపోతోంది. వాడి కాళ్లు ప‌ట్టుకోవ‌డం, వీడి కాళ్లు ప‌ట్టుకోవ‌డానికే స‌రిపోతోంది. మీరా నా గురించి మాట్లాడేది” అంటూ త‌మ్మారెడ్డి రెచ్చిపోయారు. ఆయ‌న మాట‌ల్లోని సారాంశం ఏంటంటే…నీయ‌మ్మ మొగుడు నీకు సంస్కారం, నీతి, రీతి నేర్పించాడా? అనే నిల‌దీత‌. నాగ‌బాబుకు ఓ రేంజ్‌లో త‌మ్మారెడ్డి చాకిరేవు పెట్టారు. ప్ర‌స్తుతం ఆయ‌న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.