దుబాయ్ లో హనీమూన్ కు నరేష్, పవిత్ర జంట‌!

ఇటీవల పెళ్లి జరిగిందని వీడియో షేర్ చేసిన నరేష్- పవిత్ర జంట హ‌నీమున్ కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు ఉదయం నరేష్…

ఇటీవల పెళ్లి జరిగిందని వీడియో షేర్ చేసిన నరేష్- పవిత్ర జంట హ‌నీమున్ కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు ఉదయం నరేష్ పెళ్ళికి సంబందించిన వీడియోను షేర్ చేస్తూ ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కావాలంటూ ట్వీట్ చేశారు. 

గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంటోన్న నరేష్‌-పవిత్రా లోకేశ్‌లు పెళ్లి బంధంతో ఒక్కటైనా వెంట‌నే దుబాయ్‌ వీధుల్లో ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.  నరేశ్‌కు నాలుగో పెళ్లి కాగా పవిత్ర లోకేశ్‌కు రెండో పెళ్లి కావడం గమనార్హం.

కాగా పెళ్లి, హనీమున్ కు సంబందించిన వీడియోస్, ఫొటోస్ వెంట వెంట‌నే వైరల్ అవ్వడం గమనార్హం. ముందు ముందు వీరికి సంబందించిన ఎటువంటి న్యూస్ వస్తుందా అన్ని నరేష్ పవిత్ర అభిమానులు ఎదురుచూస్తున్నారు. మ‌రికొంత మంది మాత్రం ఇది ఏదో సినిమాకు సంబంధించిన ప్రమెషన్స్ కోసం వీడియోలు వ‌దులుతున్న‌రంటూ కొట్టిప‌డేస్తూన్నారు. ఏది నిజం ఏది త‌ప్పు అనేది తెలియాల్సిఉంది.