ఆ హీరోయిన్ పెళ్లిపై మరిన్ని అనుమానాలు

కీర్తిసురేష్ పెళ్లిపై పుకార్లు ఇప్పుడు కొత్తగా వస్తున్నవేం కాదు. చాన్నాళ్ల కిందటే ఆ పుకార్లు వ్యాపించాయి, ఇప్పుడా ఊహాగానాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే తాజా అప్ డేట్ ఏంటంటే, ఈ ముద్దుగుమ్మ పెళ్లికి రెడీ…

కీర్తిసురేష్ పెళ్లిపై పుకార్లు ఇప్పుడు కొత్తగా వస్తున్నవేం కాదు. చాన్నాళ్ల కిందటే ఆ పుకార్లు వ్యాపించాయి, ఇప్పుడా ఊహాగానాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే తాజా అప్ డేట్ ఏంటంటే, ఈ ముద్దుగుమ్మ పెళ్లికి రెడీ అయింది.

30 ఏళ్ల కీర్తిసురేష్, ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతోంది. దీనికి బలమైన సాక్ష్యం ఏంటంటే.. ఆమె కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు అంగీకరించడం లేదు. రీజన్ ఏంటని అడిగితే, 'పెళ్లి కోసం' అనే సమాధానం వస్తోంది.

ప్రస్తుతం కీర్తిసురేష్ చేతిలో అరడజను సినిమాలున్నాయి. వీటిలో దసరా అనే తెలుగు సినిమా, మామన్నన్ అనే తమిళ సినిమా షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి.

చిరంజీవితో భోళాశంకర్ సినిమా చేస్తోంది కీర్తిసురేష్. ఈ సినిమాకు సంబంధించి తన పోర్షన్ ను వీలైనంత త్వరగా పూర్తిచేయమని ఆమె ఇప్పటికే మెహర్ రమేష్ ను కోరింది. అటు చిరంజీవి కూడా కీర్తిసురేష్ కోసం భోళాశంకర్ షూటింగ్ ను తొందరగా పూర్తిచేస్తున్నారు.

ఇక మిగిలిన 3 తమిళ సినిమాల్లో ఒక సినిమాను పూర్తిచేసి, మిగిలిన 2 సినిమాల్ని పెళ్లి తర్వాత పూర్తిచేసేలా నిర్మాతలతో అంగీకారానికి వచ్చింది.

ఇలా తన సినిమాల షెడ్యూల్స్ అన్నింటినీ పక్కాగా ప్లాన్ చేసుకొని, కొత్త సినిమాలేవీ అంగీకరించడం లేదు కీర్తిసురేష్. త్వరలోనే ఆమె పెళ్లిపై ప్రకటన వచ్చేలా ఉంది.