సినిమా టికెట్ల ధరల విషయంలో అనూహ్య మద్దతు…?

సినిమా టికెట్ల వ్యవహారం ఏపీలో అతి పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ఇపుడు మరే ప్రజా సమస్య లేనట్లుగా అంతా దీని మీదనే పెద్ద ఎత్తున పడుతున్నారు. ఇక విపక్షాలకు చెందిన నేతలు అయితే…

సినిమా టికెట్ల వ్యవహారం ఏపీలో అతి పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ఇపుడు మరే ప్రజా సమస్య లేనట్లుగా అంతా దీని మీదనే పెద్ద ఎత్తున పడుతున్నారు. ఇక విపక్షాలకు చెందిన నేతలు అయితే ఇది మహాపరాధామని అనే దాకా వెళ్లారు.

నిజానికి సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. అలాగే సినిమా హాళ్ళలో అధికారులు దాడులు చేస్తూ పార్కింగ్ ని ఉచితం చేయడం, క్యాంటీన్ రేట్లను బాగా తగ్గించడం పట్ల కూడా జనాలు ఖుషీగా ఉన్నారు.

ఇక సినిమా టికెట్ల ధరలను పొలిటికల్ చేయాలని చూసే వారు మాత్రమే తరచూ మాట్లాడుతున్నారు అన్న చర్చ కూడా ఉంది. ఇదిలా ఉంటే విశాఖ వచ్చిన ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అయితే సినిమా టికెట్ల ధరలను తగ్గించడం మంచిదే అని మద్దతు ఇచ్చారు.

అంతే కాదు ప్రభుత్వానికి సినిమా టికెట్ల ధరలను నియంత్రించే అధికారం కూడా ఉందని ఆయన అన్నారు. సినిమాలకు మధ్యతరగతి పేద వర్గాలు ఎక్కువగా వెళ్తారని, వారికి వినోదం అందుబాటులో ఉండాలన్నదే దీని వెనక ఉద్దేశ్యంగా చెప్పారు.

అందరికీ ఒక్కటే  నిబంధనగా ఉండాలి తప్ప ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా సినిమా టికెట్ల ధరలను పెంచుకునే వీలు ఉండరాదని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే లోకాయుక్త  నుంచి ప్రభుత్వానికి అనూహ్య మద్దతు లభించింది.