డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులకు చేదువార్త..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సబ్ స్క్రైబర్లకు ఇదో చేదువార్త. డిస్నీ సంస్థ HBO తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ డీల్ క్యాన్సిల్ కావడంతో ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్…

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సబ్ స్క్రైబర్లకు ఇదో చేదువార్త. డిస్నీ సంస్థ HBO తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ డీల్ క్యాన్సిల్ కావడంతో ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ ఇకపై కనిపించవు. ఏప్రిల్-1నుంచి ఈ ఒప్పందం రద్దు అమలులోకి రాబోతోంది.

గేమ్ ఆఫ్ థ్రోన్స్.. డిస్నీ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ చాలా ఫేమస్. ప్రస్తుతం ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఇప్పుడు HBOతో ఒప్పందం రద్దు కావడంతో దీని స్ట్రీమింగ్ ఆగిపోతుంది. దీంతో చాలామంది సబ్ స్క్రైబర్లు డిజప్పాయింట్ అవుతున్నారు.  

HBO మొదలైనప్పుడు వచ్చిన పాపులర్ షోస్ అన్నీ ఆ తర్వాత డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. వాటివల్ల ఓటీటీ ప్లాట్ ఫామ్ కి కూడా బాగా డిమాండ్ పెరిగింది. సబ్ స్క్రైబర్లు పెరిగారు. దీనికి తోడు HBO ఒరిజినల్స్ పేరుతో భారీగా కంటెంట్ డంప్ అవుతోంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా డిస్నీ సంస్థ తీసుకున్న నిర్ణయంతో HBOతో ఒప్పందం క్యాన్సిల్ అయింది. ఇప్పుడు సబ్ స్క్రైబర్లు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఆల్టర్నేట్ ఏంటి..?

డిస్నీతో డీల్ క్యాన్సిల్ అయినా కూడా HBO కంటెంట్ మాత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. ద ఫ్లైట్ అటెండెంట్, ప్రెట్టీ లిటిల్ లయర్స్.. లాంటి HBO ఒరిజినల్స్ ఇప్పుడు అమెజాన్ లో ఉన్నాయి. దీంతో ఇప్పుడు HBO ఒరిజినల్స్ కి ఫ్యాన్స్ అయినవారు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఒకరకంగా ఇది డిస్నీకి మాత్రం పెద్ద దెబ్బే అని చెప్పాలి.