ప్రాజెక్ట్ కే పరిస్థితి ఏమిటి?

ప్రాజెక్ట్ కె వర్క్ కంఫర్టబుల్ గా వుందని, పక్కాగా సంక్రాంతి విడుదలకు అడ్డేం లేదని ఓ పక్క వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అమితాబ్ రెండు మూడు నెలల వరకు రాకపోవచ్చు అని, దాని వల్ల…

ప్రాజెక్ట్ కె వర్క్ కంఫర్టబుల్ గా వుందని, పక్కాగా సంక్రాంతి విడుదలకు అడ్డేం లేదని ఓ పక్క వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అమితాబ్ రెండు మూడు నెలల వరకు రాకపోవచ్చు అని, దాని వల్ల ఆయన చేయాల్సిన పదిశాతం సీన్లు బకాయి వుండిపోతాయని కూడా వినిపిస్తోంది. 

మొత్తం మీద సంక్రాంతికి ప్రాజెక్ట్ కె వస్తుందా? రాదా? అన్నది పెద్ద డిస్కషన్ పాయింట్ గా మారుతోంది టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో.

మరోపక్కన సమ్మర్ కు వెళ్తుంది అనుకున్న రామ్ చరణ్-శంకర్ సినిమా సంక్రాంతికే ఎయిమ్ చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరి రెండు భారీ సినిమాలు సంక్రాంతికి ఢీ కొంటాయా? ఒకటి వెనక్కు తగ్గుతుందా అన్నది మరో రెండు మూడు నెలలకు కానీ క్లారిటీ రాకపోవచ్చు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రాజెక్ట్ కే దిల్ రాజు సినిమా కాదు. కనీసం ఆయన డిస్ట్రిబ్యూషన్ సినిమా కూడా కాదు. అందువల్ల కచ్చితంగా దిల్ రాజు సంక్రాంతికి తనదో లేదా తన పంపిణీతో ఏదో ఒక సినిమా దింపకుండా వుండరు. అలా దింపితే కచ్చితంగా మళ్లీ థియేటర్ల సమస్య వస్తుంది. 

ప్రతి సంక్రాంతికీ ఈ సందడి మామూలే. ఈ సంక్రాంతికి కూడా ఇలాంటిది ఏదో వుండేలాగే వుంది. అందుకే ఈ తలకాయనొప్పి నుంచి తప్పించుకోవడానికి మహేష్-త్రివిక్రమ్ సినిమా ఎలాగైనా ఆగస్ట్ కే రావాలని ప్రయత్నిస్తోంది.