రామ్ చరణ్ – సి.ఇ.ఓ !

రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ టాప్ డైరక్టర్ శంకర్ దే. దిల్ రాజు నిర్మాణం. ఈ పాన్ ఇండియా సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా…

రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ టాప్ డైరక్టర్ శంకర్ దే. దిల్ రాజు నిర్మాణం. ఈ పాన్ ఇండియా సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 27న ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి అప్ డేట్ అంటే ముందుగా రావాల్సింది సినిమా టైటిల్ నే.

ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ ఒకసారి వినిపించింది. కానీ ఇప్పుడు బలంగా వినిపిస్తున్న టైటిల్ మరోటి వుంది. అదే…’’..సి..ఇ..ఓ..’’ పాన్ ఇండియా సినిమా కనుక సిఇఓ అంటే అన్ని భాషల జనాలకు ఇట్టే కనెక్ట్ అయిపోతుందని భావిస్తున్నారని తెలుస్తోంది. 

ప్రస్తుతం పరిశీలనలో వున్న రెండు మూడు టైటిళ్లలో ఇది కీలకంగా వుందని బోగట్టా. ఈ సినిమా ప్రభుత్వం..పాలన..ప్రజలు..హక్కులు ఇలాంటి వాటన్నింటి చుట్టూ తిరిగే కథతో నడుస్తోంది. 

ఇందులో రామ్ చరణ్ ఒకటి రెండు గెటప్ ల్లో కనిపిస్తారు. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు దిల్ రాజు నిర్మించిన సినిమాల్లో అత్యంత హై బడ్జెట్ సినిమా ఇదే.