స్పృహ‌లోకి వ‌చ్చిన సాక్షి

ఏపీ అధికార ప‌త్రిక సాక్షి ఎట్ట‌కేల‌కు స్పృహ‌లోకి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో, కావాల్సిన కోణంలో సాక్షి ఓ ఇంట‌ర్వ్యూను ప్ర‌చురించింది. దీనికి ప్రేర‌ణ‌, స్ఫూర్తి ఈనాడు ప‌త్రికే అని చెప్పాలి. …

ఏపీ అధికార ప‌త్రిక సాక్షి ఎట్ట‌కేల‌కు స్పృహ‌లోకి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో, కావాల్సిన కోణంలో సాక్షి ఓ ఇంట‌ర్వ్యూను ప్ర‌చురించింది. దీనికి ప్రేర‌ణ‌, స్ఫూర్తి ఈనాడు ప‌త్రికే అని చెప్పాలి. 

సుప్రీంకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో పాటు హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఫిర్యాదు చేయ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఎందుకంటే గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి ఈ స్థాయిలో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌ల‌తో ఫిర్యాదు చేసిన దాఖ‌లాలు లేవు.

జ‌గ‌న్ లేఖ‌పై అక్ష‌రం ముక్క కూడా రాయ‌కుండా అద్భుత‌మైన పాత్రికేయ వృత్తి ధ‌ర్మాన్ని పాటించిన ఈనాడు, దానిపై కౌంట‌ర్‌గా మాత్రం తెలంగాణ మాజీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ రామ‌కృష్ణారెడ్డి ఇంట‌ర్వ్యూ ప్ర‌చురించ‌డంతో త‌న నిజ స్వ‌రూపాన్ని లోకానికి చాటి చెప్పింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డ్డార‌ని, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రామోజీ అభిప్రాయాత‌ను రామ‌కృష్ణారెడ్డి నోటితో చెప్పించి, అచ్చోశారనే అభిప్రాయాలు లేక‌పోలేదు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ లేఖ‌కు బ‌లం క‌లిగించే న్యాయ నిపుణుల అభిప్రాయాల‌ను ఇవ్వ‌డంలో సాక్షి విఫ‌ల‌మైంద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో  సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఏకే గంగూలి తో ఇంట‌ర్వ్యూ చేయ‌డం , దాన్ని ప్ర‌చురించ‌డం ద్వారా నాణేనికి రెండో వైపు జ‌నానికి చూపించిన‌ట్ట‌వుతోంది. ఇది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌ట్ల జ‌నంలో సానుకూల వైఖ‌రితో పాటు ఎల్లో బ్యాచ్ చేసే ఒంటెత్తు ప్ర‌చారానికి చెక్ పెట్టిన‌ట్ట‌వుతుంది.

సాక్షికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌స్టిస్ ఏకే గంగూలి విలువైన అభిప్రాయాల్ని వెల్ల‌డించారు. రాజ్యాంగ బద్ధంగా విధులు నిర్వర్తించే ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలతో కూడిన లేఖ రాసినప్పుడు.. దానిపై విచారణ జరగాలని, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని తేల్చి చెప్పారు.

న్యాయ వ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యమ‌న్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని, ముఖ్యమంత్రి స్వయంగా రాజ్యాంగ విధులు నిర్వర్తించే వ్యక్తి అని, రాష్ట్రంలో అత్యున్నత కార్యనిర్వాహక హోదా కలిగిన వ్యక్తైన ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి కాగలిగిన సీనియర్‌ న్యాయమూర్తిపై పలు ఆరోపణలతో కూడిన లేఖను చీఫ్‌ జస్టిస్‌కు రాశారని గంగూలి గుర్తు చేశారు.

రాష్ట్ర హైకోర్టు న్యాయ పాలనలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారన్నారు. ముఖ్యమంత్రికి గల రాజకీయ విరోధులకు ప్రయోజనం చేకూర్చేలా ఒక ప్రణాళికతో ఆ న్యాయమూర్తి వ్యవహరించారని, అపవిత్రమైన భూ వ్యవహారాల్లో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారన్నారు.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటారని నేను అనుకోనని అభిప్రాయ‌ప‌డ్డారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తప్పకుండా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నానని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆరోపణలపై తగిన రీతిలో దర్యాప్తు జరపాలని ఆయ‌న డిమాండ్ చేశారు. అలాగే ఇటీవ‌ల హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ జారీ చేయ‌డాన్ని కూడా ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ఆరోపణలపై ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని స్ప‌ష్టం చేశారు. ఎందుకంటే న్యాయమూర్తులంటే ప్రజాస్వామ్యంలో సభ్యులని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఏది ఏమైనా ప్ర‌త్య‌ర్థి మీడియా పుంఖాను పుంఖాలుగా తామో మోసే పార్టీ, వ్య‌క్తుల‌కు అనుకూలంగా సంబంధిత నిపుణుల‌తో ఇంట‌ర్వ్యూలు చేస్తూ నెమ్మ‌దిగా ఓ విష ప్ర‌చారానికి తెగ‌బ‌డుతున్న స‌మ‌యంలో సాక్షి స్పృహ‌లోకి రావ‌డం వైసీపీ శ్రేణుల‌కు ఆనందం క‌లిగిస్తోంది. ఈ వైఖ‌రి కొన‌సాగించాల‌ని వైసీపీ ఆశిస్తోంది.

ఇంకెన్ని రహస్య జీవోలు, వ్యవహారాలున్నాయో