చివరాఖరుకు..కిరణ్ అబ్బవరం కూడా

హీరోగా మొహానికి మేకప్ వేసుకున్న దగ్గర నుంచి మొదలవుతుంది. మాస్ సినిమా ఎప్పుడు చేసేద్దామా అన్నది తహ..తహ.డైలాగులు కొట్టేయాలి. హీరోయిన్ ను పట్టేయాలి…ఛేజింగ్ లు..జంపింగ్ లు..పంచ్ లు..ఫైటింగ్ లు..ఇలా పక్కా రొటీన్ ఫార్ములా వెంట…

హీరోగా మొహానికి మేకప్ వేసుకున్న దగ్గర నుంచి మొదలవుతుంది. మాస్ సినిమా ఎప్పుడు చేసేద్దామా అన్నది తహ..తహ.డైలాగులు కొట్టేయాలి. హీరోయిన్ ను పట్టేయాలి…ఛేజింగ్ లు..జంపింగ్ లు..పంచ్ లు..ఫైటింగ్ లు..ఇలా పక్కా రొటీన్ ఫార్ములా వెంట పరుగులు తీసేయాలని ఎంత తపనో. 

ఇప్పటి వరకు చిన్నా, పెద్దా అందరు హీరోలు అరగదీసేసిన జానర్ నే ఇది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా చేసేసాడు. హమ్మయ్య. ఇక ఓ పనై పోయింది.

మీటర్ అనే సినిమా వచ్చింది క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నుంచి. ఈ సినిమా నుంచి 75 సెకెండ్ల టీజర్ ను విడుదల చేసారు. ఒక్క సీన్ కొత్తది వుంటే ఒట్టు. ప్రతి సీన్ ఏదో ఒక సినిమాలో చూసినట్లే వుంది. ప్రతి డైలాగు ఏదో ఒక హీరో నోటి వెంట విన్నట్లే వుంది. నిజానికి కిరణ్ అబ్బవరం లాంటి అప్ కమింగ్ హీరోలు, వైవిధ్యమైన స్క్రిప్ట్ లు ఎంచుకుని, జనాలకు ఎస్టాబ్లిష్డ్ హీరోలు చూపించనిది చూపించాలి.

అది మానేసి తమ సరదా తీర్చేసుకోవానికి ఇలాంటి సినిమాలు చేస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో రిజల్ట్ చూసాక కానీ తెలియదు, ప్రస్తుతానికి కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ మాత్రం మా హీరో అదిరిపోయాడు..అదరగొట్టాడు అని మాత్రం అనుకోవచ్చు.