సినిమా రంగంలో తెరవెనుక అనేకానేక సంఘటనలు జరుగుతుంటాయి. వార్తల్లో ఎక్కువగా వినిపించే పొలిటికల్ మారాజు ఒకరు వున్నారు. ఆయనకు సినిమా రంగంతో కూడా కాస్త మంచి సంబంధాలే వున్నాయి. కొన్నాళ్ల క్రితం ఓ మెగా హీరో సినిమా వచ్చింది.
మాంచి ఫీల్ గుడ్ లవ్ సబ్జెక్ట్ తో తీసిన ఆ సినిమాకు ఫలానా హీరోయిన్ ను పెట్టుకోండి అంటూ నిర్మాత మీద తెగ వత్తిడి తెచ్చారట ఆ పెద్దాయిన.
మాంచి ఫిజిక్ తో, మత్తెక్కించే కళ్లతో, కవ్వించే విధంగా చిట్టి పొట్టి నిక్కర్లతో తన తొలి సినిమాలో నటించిన ఈ నటి తెలుగులో అడపాదడపా నటిస్తూ వుంటుంది.
ఆమెను ఎలాగైనా ఆ సినిమాలో హీరోయిన్ గా పెట్టించాలని తెగ ప్రయత్నించారట. కానీ అప్పటికే హీరోయిన్ ను ఫిక్స్ చేసేయడంతో యూనిట్ ఆయన మాటను పక్కన పెట్టేసిందట.
మొత్తం మీద ఈ పొలిటికల్ మారాజు ఇలాంటి డీల్స్ లో కూడా చేతులు పెట్టారని ఆలస్యంగా వినిపిస్తున్న గుసగుసల్లో తెలుస్తోంది. మెలమెల్లగా ఇంకెన్ని తెలుస్తాయో చూడాలి.