లీగల్ తగాదాలు ఉన్నాయేమో వెతకండి!

అమరావతి ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖకు, కర్నూలు కు తరలించే ప్రయత్నంలో…  న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒకసారి రాజధాని మార్పు నిర్ణయం గురించి అధికారికంగా ప్రకటించిన తరువాత, దానిని అమలులో పెట్ట…

అమరావతి ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖకు, కర్నూలు కు తరలించే ప్రయత్నంలో…  న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒకసారి రాజధాని మార్పు నిర్ణయం గురించి అధికారికంగా ప్రకటించిన తరువాత, దానిని అమలులో పెట్ట లేకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండే పరిస్థితి దాపురించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు గాని, ఇప్పటికే కొంతమేరకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు గాని… న్యాయ పీఠాన్ని ఆశ్రయిస్తే ఎదురుగా గల చిక్కులను అంచనా వేసి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించడానికి న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటోంది.

రాజధానిని వికేంద్రీకరించి అమరావతి తో పాటు విశాఖపట్నం, కర్నూలు లలో కూడా  ఏర్పాటు చేయాలని జి ఎస్ రావు కమిటీ సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూలులో న్యాయపరమైన రాజధాని,  అమరావతిలో శాసన సభల రాజధాని  ఏర్పాటు కావాలనేది ఆలోచన. 

అయితే ఈ ఆలోచనలపై అమరావతి ప్రాంత రైతుల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ఆందోళనలతో రైతులు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఈ ఉద్యమాలు అన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలు గానే సాగుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.  ఈ క్రమంలో అక్కడి వ్యవహారాలు నిర్వహిస్తున్న మీడియా మీద కూడా దాడులు జరుగుతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే…  అమరావతి ప్రాంతం నుంచి రాజధాని తరలించాలని ప్రభుత్వ ఆలోచన మీద కోర్టును ఆశ్రయించిన డానికి రైతులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ నాయకుడు,  మాజీ కేంద్రమంత్రి…  రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూన్న సుజనా చౌదరి కూడా..  రైతులు కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టు ద్వారా ఎదుర్కోగలిగేది అయినా కాకపోయినా..  ఒకసారి కోర్టుకు వెళితే రాజధాని తరలింపు ప్రక్రియను కొన్ని సంవత్సరాల పాటు ఆచరణ లోకి రాకుండా సాగతీయవచ్చుననేది రాజకీయ కుట్ర లాగా కనిపిస్తోంది.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీల వారు తమ చేతికి మట్టి అంటకుండా ఈ ప్రాంత రైతులు ద్వారా కేసులు వేయించి అడ్డుకునే కుట్ర రచన చేస్తున్నారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన జగన్ సర్కారు…  న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందే నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిర్ణయం ప్రకటిస్తే గనుక,  ఎవరైనా కేసులు వేసినా సరే,  ప్రక్రియ ఆగకుండా  న్యాయపరమైన మార్గాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

విశాఖ మాత్రమే సరైన ఆలోచన