సాహో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. సైరా గురించి టాలీవుడ్ అంతా చర్చించుకుంది. మహేష్ 25వ చిత్రం మహర్షి చాలా బజ్ క్రియేట్ చేసింది. అయితే ఇవన్నీ చెప్పుకోవడం వరకే. గూగుల్ లో ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాలకు అస్సలు స్థానం దక్కలేదు.
అవును.. గూగుల్ టాప్-10 ట్రెండింగ్ మూవీస్ లో ఒక్క తెలుగు సినిమాకు కూడా చోటు దక్కలేదు. ఆ మాటకొస్తే, సౌత్ నుంచి ఏ ఒక్క సినిమాకు గూగుల్ టాప్-10లో స్థానం లేదు.2019లో గూగుల్ లో అత్యథికంగా ట్రెండ్ అయిన సినిమాల జాబితాలో హిందీ మూవీస్ ఆధిపత్యం కొనసాగించింది.
మధ్యలో 2-3 హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. సౌత్ నుంచి మాత్రం ఒక్క సినిమా కూడా టాప్-10 ట్రెండింగ్స్ లో నిలవలేకపోయింది. నిజానికి సాహో సినిమా టాప్-10 ట్రెండింగ్స్ లో నిలుస్తుందని భావించారంతా. కానీ ఆ సినిమా పాటలు ట్రెండ్ అయ్యాయి తప్ప సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు.మహర్షి, సైరా విషయంలో కూడా ఇలానే జరిగింది. సౌత్ లో ఈ సినిమాలు భారీగా ట్రెండ్ అయ్యాయి. టీజర్, ట్రయిలర్స్ తో దేశవ్యాప్తంగా కూడా ట్రెండ్ అయ్యాయి.
కానీ ఓవరాల్ ట్రెండ్స్ లో మాత్రం వెనకబడ్డాయి. లిస్ట్ లో మొదటి స్థానంలో కబీర్ సింగ్ సినిమా నిలిచింది. అర్జున్ రెడ్డికి రీమేక్ గా సందీప్ రెడ్డి వంగ తీసిన ఈ సినిమా, దాదాపు 3 వారాల పాటు గూగుల్ లో ట్రెండ్ అయి టాప్ లో నిలిచింది.
ఇక రెండో స్థానంలో ఎవెంజర్స్-ఎండ్ గేమ్, మూడో స్థానంలో జోకర్, నాలుగో స్థానంలో కెప్టెన్ మార్వెల్ సినిమాలు నిలిచాయి. ఇండియాలో కూడా ఈ సినిమాలు టాప్ ట్రెండింగ్స్ లో నిలిచాయి. హృతిక్ నటించిన సూపర్30 సినిమాతో పాటు..మిషన్ మంగళ్, గల్లీ బాయ్, వార్, హౌజ్ ఫుల్ 4, యూరీ-ది సర్టికల్ స్ట్రయిక్ సినిమాలు 2019 టాప్-10 ట్రెండింగ్ లిస్ట్ లో ఉన్నాయి.