సుశాంత్ సోద‌రి సంచ‌ల‌న నిర్ణ‌యం

బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆక‌స్మిక మృతి బాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం బాలీవుడ్‌లో అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. Advertisement సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు నెపోటిజం (బంధుప్రీతి) కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌ల‌తో మొద‌లై చివ‌రికి…

బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆక‌స్మిక మృతి బాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం బాలీవుడ్‌లో అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు నెపోటిజం (బంధుప్రీతి) కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌ల‌తో మొద‌లై చివ‌రికి డ్ర‌గ్స్‌, లైంగిక ఆరోప‌ణ‌లు ఇలా అనేకానేక మ‌లుపులు తిరుగుతోంది.

ఈ నేప‌థ్యంలో సుశాంత్ సోద‌రి శ్వేతాసింగ్ కీర్తి సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ … మృతిపై విచార‌ణ‌కు డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత సోద‌రుడి గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఆమె షేర్ చేస్తూ వ‌చ్చారు.

తాజాగా శ్వేతాసింగ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సోష‌ల్ మీడియా నుంచి నిష్క్ర‌మించాల‌ని ఆమె నిర్ణ‌యించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బుధవారం తొలగించారు. సుశాంత్ తమను వీడి నేటితో (అక్టోబర్14) నాలుగు నెలలైన సందర్భంగా  “నిజమైన ప్రేరణ” అంటూ ఒక  వీడియోను కూడా ఆమె షేర్ చేశారు.  ఇదే స‌మ‌యంలో  ఆమె స‌డెన్‌గా తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. ఫేస్ బుక్  అకౌంట్ మాత్రం కొన‌సాగిస్తుండ‌డం విశేషం.

ఇంకెన్ని రహస్య జీవోలు, వ్యవహారాలున్నాయో