మళ్లీ పెళ్లి చేసుకోనున్న హీరోయిన్‌!

ఇటీవ‌లే వివాహం చేసుకున్నా న‌టి స్వ‌రా భాస్క‌ర్, ఫ‌హ‌ద్ అహ్మ‌ద్ జంట మ‌రోసారి వివాహం చేసుకోనున్నారు. ఇటీవ‌ల రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట‌ తాజాగా మ‌రోసారి సంప్ర‌దాయ‌బ‌ద్దంగా వివాహ‌మాడ‌నున్నారు. Advertisement త‌న తాజా వెడ్డింగ్…

ఇటీవ‌లే వివాహం చేసుకున్నా న‌టి స్వ‌రా భాస్క‌ర్, ఫ‌హ‌ద్ అహ్మ‌ద్ జంట మ‌రోసారి వివాహం చేసుకోనున్నారు. ఇటీవ‌ల రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట‌ తాజాగా మ‌రోసారి సంప్ర‌దాయ‌బ‌ద్దంగా వివాహ‌మాడ‌నున్నారు.

త‌న తాజా వెడ్డింగ్ కార్డ్ ను స్వ‌రా భాస్క‌ర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఢిల్లీలో ఈ నెల 15-16 తేదీల్లో బంధుమిత్రుల స‌మ‌క్షంలో వీరి వివాహం జ‌ర‌గనుంది. కార్డులో ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో వధూవరులు ఉన్నట్లు వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేశారు.

ఇటీవలే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఫహద్‌ను వివాహం చేసుకున్న‌ స్వరా భాస్కర్ ఫస్ట్ నైట్​కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. హనీమూన్ బెడ్​ను తన తల్లి గులాబీలతో అలంకరించిందంటూ ఆ ఫోటోల‌ను ఫ్యాన్స్​తో పంచుకుంది. దీంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. తాజాగా మ‌రోసారి వెడ్డింగ్ కార్డ్ అంటూ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.