ఇటీవలే వివాహం చేసుకున్నా నటి స్వరా భాస్కర్, ఫహద్ అహ్మద్ జంట మరోసారి వివాహం చేసుకోనున్నారు. ఇటీవల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట తాజాగా మరోసారి సంప్రదాయబద్దంగా వివాహమాడనున్నారు.
తన తాజా వెడ్డింగ్ కార్డ్ ను స్వరా భాస్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఢిల్లీలో ఈ నెల 15-16 తేదీల్లో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. కార్డులో ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో వధూవరులు ఉన్నట్లు వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేశారు.
ఇటీవలే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఫహద్‌ను వివాహం చేసుకున్న స్వరా భాస్కర్ ఫస్ట్ నైట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. హనీమూన్ బెడ్‌ను తన తల్లి గులాబీలతో అలంకరించిందంటూ ఆ ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. దీంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి వెడ్డింగ్ కార్డ్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.