లక్నోలో దసరా ట్రయిలర్

నాని ‘దసరా’ సినిమాను హిందీ బెల్ట్ లో గట్టిగా ప్రమోట్ చేయడానికి డిసైడ్ అయిపోయారు నిర్మాతలు. ముందుగా ముంబాయిలో ఓ భారీ ఈవెంట్ చేస్తున్నారు. దాని తరువాత లక్నోలో మరో థియేటర్ ఈవెంట్ చేసి…

నాని ‘దసరా’ సినిమాను హిందీ బెల్ట్ లో గట్టిగా ప్రమోట్ చేయడానికి డిసైడ్ అయిపోయారు నిర్మాతలు. ముందుగా ముంబాయిలో ఓ భారీ ఈవెంట్ చేస్తున్నారు. దాని తరువాత లక్నోలో మరో థియేటర్ ఈవెంట్ చేసి అక్కడ ఆల్ లాంగ్వేజెస్ ట్రయిలర్ ను విడుదల చేస్తారు. 

లక్నో అయితే అటు బీహార్, ఇటు యుపి ఇలా అన్నింటికి మధ్యగా వుంటుందని, సినిమా రీచ్ కు పనికి వస్తుందని ఈ విధంగా ప్లాన్ చేసారు. మొత్తం నార్త్ లో మూడు ఈవెంట్లు ప్లాన్ చేసారు.

ట్రయిలర్ ఈవెంట్ ఈ నెల 14 లేదా 15న ప్లాన్ చేస్తారు. ఇప్పటికి రెండు పాటలు వదిలారు. మరో పాట విడుదల ఈ వారంలో వుంటుంది. దసరా సినిమా ప్రచారం మీద హీరో నాని కాస్త గట్టి దృష్టినే పెట్టారు. వారం రోజులు నార్త్ కు కేటాయించారు. ఆ తరువాత సౌత్ సెంటర్స్ లో పబ్లిసిటీ చేస్తారు. ఈ సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్నారు నాని.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.