పండగకు పోటాపోటీగా వస్తున్న పెద్ద సినిమాలు రెండూ రన్ టైమ్ లు లాక్ అయ్యాయి. ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమా రన్ టైమ్ 2 గంటల 40 నిమషాలు లాక్ చేసారు. అయితే ఫైనల్ కటింగ్ లో మరో అయిదు నిమషాలు పెరిగింది. సెన్సారు సర్టిఫికెట్ నుంచి ఎండింగ్ టైటిల్స్ వరకు అన్నీ కలుపుకుని, త్రివిక్రమ్-బన్నీల అలవైకుంఠపురములో రన్ టైమ్ రెండు గంటల 45 నిమషాలకు చేరింది.
ఇదిలా వుంటే సరిలేరు నీకెవ్వరూ రన్ టైమ్ కూడా లాక్ చేసి, సెన్సారు దరఖాస్తు చేసారు. రెండు గంటల 49 నిమషాలు నిడివి వచ్చింది. ఇది మరో నిమిషం అటు ఇటు కావచ్చు. టోటల్ గా రెండు గంటల 50 నిమషాలు అనుకోవాలి. ఆ విధంగా సరిలేరు రన్ టైమ్ అల వైకుంఠపురములో కన్నా అయిదు నిమషాలు ఎక్కువ.
వాస్తవానికి త్రివిక్రమ్ సినిమాల రన్ టైమ్ ఎక్కువ వుంటుంది. ఈసారి కూడ కాస్త ఎక్కువ ఫుటేజ్ నే వచ్చింది. కానీ వీలయినంత షార్ప్ చేయాలని, ఒకటికి పదిసార్లు చూసి ఆ మేరకు తీసుకువచ్చారు. ఇలా తీసుకురావడం వెనుక నిర్మాత చినబాబు (రాధాకృష్ణ), పట్టుదల కూడా వుంది. మరీ రన్ టైమ్ ఎక్కువ వద్దని ఆయన పట్టుపట్టి నిడివిని తగ్గించినట్లు బోగట్టా.
రెండు సినిమాలు ఒక రోజు తేడాతో జనవరిలో సంక్రాంతి ముందు విడుదల కాబోతున్నాయి. రెండింటికి భారీ బజ్ వుంది. మాంచి పబ్లిసిటీ జరుగుతోంది.