తెలంగాణలో పవర్ సెంటర్ చేతులు మారుతోందా?

రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అంతా అనుకున్నారు. ఈ మేరకు ఎన్నికలకు ముందే కేసీఆర్, తెరవెనక ఏర్పాట్లన్నీ పూర్తిచేయడంతో ఆ మేరకు లీకులు షురూ అయ్యాయి. Advertisement వీటికి మరింత…

రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అంతా అనుకున్నారు. ఈ మేరకు ఎన్నికలకు ముందే కేసీఆర్, తెరవెనక ఏర్పాట్లన్నీ పూర్తిచేయడంతో ఆ మేరకు లీకులు షురూ అయ్యాయి.

వీటికి మరింత ఊతమిస్తూ, హరీష్ రావుకు అప్పట్లో ప్రాధాన్యం తగ్గించడం కూడా చర్చనీయాంశమైంది. అయితే అన్ని రకాల ఊహాగానాలకు తెరదించుతూ మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు కేసీఆర్.

ఇప్పటివరకు అంతా సజావుగానే సాగుతోంది. తొలి మంత్రివర్గ విస్తరణలో హరీష్, కేటీఆర్ ను పక్కనపెట్టిన ముఖ్యమంత్రి.. మలి మంత్రివర్గ విస్తరణలో వాళ్లకు కూడా మంత్రి పదవులిచ్చారు. ప్రస్తుతం పార్టీలో అంతా సంతృప్తిగానే ఉన్నారు.

ఎలాంటి అసంతృప్తి లేదు. అటు ప్రతిపక్షం కూడా ఒకింత స్తబ్దుగా తయారైంది. ఇక రాష్ట్రంలో అట్టుడికే సమస్యలు కూడా కనిపించడం లేదు. సో.. తనయుడికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించడానికి ఇంతకంటే సరైన సమయం ఉండదని భావిస్తున్నారు కేసీఆర్.

అన్నీ అనుకున్నట్టు జరిగితే కొత్త ఏడాదిలో ఏ క్షణానైనా కేటీఆర్ సీఎం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గుసగుసల సారాంశం ఇదే. 

తను తప్పుకొని, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే ఏమైనా అభ్యంతరమా అంటూ కేసీఆర్, ఇప్పటికే పలువురు కీలక మంత్రులను అడిగారు. వీళ్లలో హరీష్ రావు కూడా ఉన్నారు. వాళ్లంతా కేటీఆర్ కు పూర్తి మద్దతు తెలిపినట్టు సమాచారం.ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. జనవరి నెలాఖరుతో ఆ ప్రహసనం ముగుస్తుంది. అది పూర్తయిన వెంటనే కేటీఆర్ పట్టాభిషేకం ఉంటుందంటున్నారు చాలామంది టీఆర్ఎస్ నేతలు.

ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ సర్కార్ కు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏపీ-తెలంగాణ మధ్య చాలా వివాదాలు నడిచాయి.

కేవలం తన రాజకీయాల కోసం బాబు అప్పట్లో అలా వ్యవహరించారు. ఎప్పుడైతే జగన్ ముఖ్యమంత్రి అయ్యారో, చిటికెలో చాలామటుకు విభజన సమస్యల్ని పరిష్కరించారు. ఆస్తుల పంపకాలపై కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు ఓ అంగీకారానికి వచ్చారు.పైగా జగన్, కేటీఆర్ కూడా సన్నిహితులు.

అటు ఎన్నడూలేని విధంగా కేటీఆర్ కూడా రాజకీయాల నుంచి గ్యాప్ తీసుకున్నారు. చాన్నాళ్ల తర్వాత కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. సీఎం అయితే ఇక తీరిక ఉండదు కాబట్టే, కేటీఆర్ ఇలా ముందుగానే విరామం తీసుకున్నారని అంటున్నారు చాలామంది. ఈ సంకేతాలన్నీ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసమే అనిపించేలా ఉన్నాయి. సో.. కొత్త ఏడాదిలో తెలంగాణలో ఓ సరికొత్త రాజకీయ మార్పు చూడబోతున్నారు ప్రజలు.

జగన్ చేతితో కేపిటల్ పైనల్ రిపోర్ట్