టెన్షన్ లో ఎన్టీఆర్

ఒకపక్క ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతోంది. మరోపక్క అన్న కళ్యాణ్ రామ్ సినిమా 'ఎంత మంచి వాడవురా' విడుదలకు రెడీ అవుతోంది. ఇలాంటి టైమ్ లో హీరో ఎన్టీఆర్ కు మరో టెన్షన్ ఏర్పడింది. ఆయనను…

ఒకపక్క ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతోంది. మరోపక్క అన్న కళ్యాణ్ రామ్ సినిమా 'ఎంత మంచి వాడవురా' విడుదలకు రెడీ అవుతోంది. ఇలాంటి టైమ్ లో హీరో ఎన్టీఆర్ కు మరో టెన్షన్ ఏర్పడింది. ఆయనను చిన్నప్పటి నుంచి బాగా చూసుకుంటూ, ఎత్తుకుని పెంచిన బాబాయ్ కు ఆరోగ్యం బాలేదు. ఎన్టీఆర్ తల్లి వైపు బంధువు ఆయన. పిన్ని భర్త. ఆయన అంటే ఎన్టీఆర్ కు బాగా అభిమానం.

ప్రస్తుతం ఆయన కేర్ ఆసుపత్రిలో వున్నారు. ఆయన ఆరోగ్యం అంత బాగాలేదని, పరిస్థితి కాస్త ఇబ్బందిగా వుందని తెలుస్తోంది. దాంతో ఎన్టీఆర్ ఎవర్నీ ఎక్కువగా కలవడం లేదు. షూటింగ్, ఆసుపత్రి, ఇల్లు అంటూ వుంటున్నారని బోగట్టా.

ఇలాంటి టైమ్ లో కళ్యాణ్ రామ్ సినిమా ఫంక్షన్ వుంది. ఏడవతేదీన చేయాలని తాత్కాలికంగా నిర్ణయించారు. మరి అది ఏం చేస్తారో చూడాలి. అలాగే అయిదున జరిగే మెగాస్టార్ చీఫ్ గెస్ట్  ఫంక్షన్ కాకుండా 9న మరో ఫంక్షన్ చేసి, దానికి ఎన్టీఆర్ ను గెస్ట్ గా తీసుకురావాలని మహేష్ సరిలేరు నీకెవ్వరు యూనిట్ అనుకుంది. బహుశా ఎన్టీఆర్ ఓకె అనకపోవచ్చు.