జగన్ కి బాబుకు అదే తేడా..!

చంద్రబాబు అంటేనే మీడియా బేబీ అనేశారు రెండు దశాబ్దలా క్రితమే బీహార్ అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. నలుగురు పోగు అయితే చాలు బాబు మైకు ఊరుకోదు. గంటల తరబడి లెక్చర్ దంచాల్సిందే.…

చంద్రబాబు అంటేనే మీడియా బేబీ అనేశారు రెండు దశాబ్దలా క్రితమే బీహార్ అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. నలుగురు పోగు అయితే చాలు బాబు మైకు ఊరుకోదు. గంటల తరబడి లెక్చర్ దంచాల్సిందే.

ఆత్మ స్తుతి పరనిందా టైప్ లో  సుత్తి కొడుతూ  గంటలను ఖర్చు చేసేస్తారని బాబుపై సెటైర్లు ఉన్నాయి. జగన్ విషయం తీసుకుంటే అందుకు పూర్తి భిన్నం. ఆయన స్వతహాగా తక్కువ మాట్లాడుతారు.

జనం వేలల్లో వచ్చారా, ఇసుకవేస్తే రాలడం లేదా ఇవన్నీ ఆలోచించుకుని జగన్ ఉపన్యాసం ఉండదు. తాను చెప్పాల్సిన దానికి ఆయన గట్టిగా కమిట్ అయి ఉన్న విషయం సుత్తి కొట్టకుండా సూటిగా చెప్పేస్తారు.

ఇక అవసరం లేదనుకున్నపుడు మౌనాన్నే ఆశ్రయిస్తారు. ఇది విశాఖలో మరో మారు వెల్లడైంది. నిజానికి  విశాఖ ఉత్సవ్ ని చంద్రబాబే ప్రారంభించారు. ఆయన ఉమ్మడి ఏపీ సీఎం గా ఉండగా విశాఖ ఉత్సవ్ కి ప్రతీ ఏటా హాజరయ్యేవారు.

ఉత్సవ్ లో ప్రధాన వేదిక మీద బాబు ప్రసంగానికే గంటల సమయం పట్టేది. బాబు ప్రసంగం చూస్తే అన్నీ తానే చేశాను, అంతా తానే చేశాను అన్న తరహాలో ప్రచార పటాటోపంతో నిండిపోయేది. బాబు నుంచి మైక్ అందుకునేసరికి నిర్వాహకులకు  పుణ్యకాలం పూర్తి అయ్యేది.

అప్పటికి వచ్చిన జనాలకు, వేదిక మీద ఆర్టిస్టులకు కూడా చుక్కలు కనిపించేవి. జగన్ విషయం మాత్రం ఇపుడు భిన్నంగా ఉంది. విశాఖ ఉత్సవ్ వేదిక మీద ఆయన ఒక్క వాక్యంతో ప్రసంగం పూర్తి అయిందనిపించేశారు.

నిజానికి విశాఖ ఇంతలా వార్మ్ వెల్ కం పలకడం సీఎం స్థాయిలో తొలిసారి. పైగా వేలాది జనం కూడా జగన్ ఏం చెబుతారో అని వచ్చివారే. మరి జగన్ నోటి వెంట  విశాఖ ఉత్సవ్ అన్న ఒక్క మాట తప్ప మరేమీ రాలేదు.

దాంతో బాబు హయాంలో దంచుడు ఉపన్యాసాలను గుర్తు చేసుకున్న జనం జగన్ స్టైలే వేరబ్బా అనుకోవడం జరిగింది. మొత్తానికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ మాట్లాడాలో, మాట్లాడకూడదో, ఎంత మోతాదులో మాట్లాడాలో తెలిసిన వాడే నాయకుడు  అని జగన్ చెప్పకనే చెప్పారని అంటున్నారు.

విశాఖలో పెద్ద ఎత్తున అభివ్రుధ్ధి పనులకు ప్రారంభం చేసి కూడా జగన్ వాటి గురించి కనీసం చెప్పుకోలేదంటే తన కంటే తన కార్యక్రమాలే మాట్లాడుతాయన్న ఆలోచనే అయి ఉంటుందని కూడా పార్టీ నాయకులు కూడా  విశ్లేషించుకుంటున్నారు