పుష్ప పరిస్థితి ఏమిటి?

అరి వీర హడావుడి నడుమ విడుదలయింది పుష్ప సినిమా. బన్నీ-సుకుమార్ కాంబినేషన్. సుకుమార్ పీకల మీద కత్తి పెట్టి మరీ డిసెంబర్ 17 న విడుదల చేయించారు. ఎలా చేస్తారో, ఏం చేస్తారో తెలియదు.…

అరి వీర హడావుడి నడుమ విడుదలయింది పుష్ప సినిమా. బన్నీ-సుకుమార్ కాంబినేషన్. సుకుమార్ పీకల మీద కత్తి పెట్టి మరీ డిసెంబర్ 17 న విడుదల చేయించారు. ఎలా చేస్తారో, ఏం చేస్తారో తెలియదు. డిసెంబర్ 17న విడుదల చేయాల్సిందే అని హీరో హుకుం జారీ చేయడంతో దర్శక నిర్మాతలు నానా తంటాలు పడి, నిద్రాహారాలు మానుకుని సినిమాను రెడీ చేసారు. 

నిజానికి ఒక్క వారం టైమ్ ఇచ్చి వుంటే దర్శకుడు సుకుమార్ కాస్త ఫైన్ ట్యూన్ చేసి వుండేవారు. సినిమాకు వచ్చిన బజ్ కు మరి కాస్త బాగుంది అని అనిపించుకుని వుంటే ఓ రేంజ్ కు వెళ్లిపోయేది. కానీ ఇప్పుడే మయింది. బన్నీ అండ్ కో కిందా మీదా పడడం తప్ప, కలెక్షన్లు జారిపోతూనే వున్నాయి.

ఆంధ్రలో ఇప్పటికి ఇంకా యాభై శాతానికి చేరుకోలేదు. నైజాంలో ఇంకా ముఫై శాతం రికవరీ రావాలి. ఇలాంటి నేపథ్యంలో ఓ హిందీ సినిమా, ఓ తెలుగు సినిమా థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ వీకెండ్ ఎంతయినా సరే ఆ సినిమాలతో పోటీ పడాల్సిందే. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు కాస్త ఆదుకుంటాయనే నమ్మకం వుంది. 

కానీ ఎంత ఆదుకున్నా వీకెండ్ లు, హాలీడేస్ లో కాస్త వసూళ్లు తెచ్చుకోవడం, మిగిలిన రోజులు డెఫిసిట్ తో నడవడం తప్పేలా లేదు. అయితే మైత్రీ సంస్థకు వున్న క్రెడిబులిటీ, వెనుక వున్న సినిమాలు అన్నీ కలిసి బయ్యర్లను టెన్షన్ ఫ్రీ గా వుంచుతున్నాయి. 

కానీ గమ్మత్తేమిటంటే హీరో బన్నీకి మాత్రం ఇవేం పట్టడం లేదు. తాను రికార్డులు సృష్టించిన సినిమా చేసానని, మీడియాలో మాత్రం ఆ మేరకు వార్తలు రావడం లేదని, ఎందుకిలా అనే మధనపడుతున్నారట. ఈ మేరకు వార్తలు రప్పించేందుకు ఆయన పీఆర్ టీమ్ కిందా మీదా అవుతోంది.