పవన్ ను తప్పించారు.. నాగ్ వస్తే తప్పు లేదా?

దిల్ రాజు చక్రం తిప్పారా.. పవన్ ఉదారంగా వ్యవహరించాడా.. రాజమౌళి మంత్రాంగం ఫలించిందా.. త్రివిక్రమ్ లాబీయింగ్ వర్కవుట్ అయిందా.. ఈ ప్రశ్నలు పక్కనపెడితే పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా మాత్రం సంక్రాంతి బరి…

దిల్ రాజు చక్రం తిప్పారా.. పవన్ ఉదారంగా వ్యవహరించాడా.. రాజమౌళి మంత్రాంగం ఫలించిందా.. త్రివిక్రమ్ లాబీయింగ్ వర్కవుట్ అయిందా.. ఈ ప్రశ్నలు పక్కనపెడితే పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా మాత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. అయితే ఇక్కడ సమస్య ఇది కాదు. బంగార్రాజు సినిమా వస్తుందంటున్నారు. ఇదే ఇక్కడ చర్చనీయాంశమైంది.

సంక్రాంతి బరిలో ప్రస్తుతానికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు మాత్రమే మిగిలాయి. అవి రెండూ పాన్ ఇండియా సినిమాలు కాబట్టి, తెలుగు సినిమా స్థాయిని పెంచడం కోసం మరో సినిమా పోటీలో లేకుండా చేశామని, భీమ్లాను తప్పించామని దిల్ రాజు ఓపెన్ గా ప్రకటించారు. మరిప్పుడు బంగార్రాజు సంక్రాంతికే వస్తానంటున్నాడు. ఈ సినిమా వస్తే దిల్ రాజుకు ఓకేనా..?

సంక్రాంతి బరిలో ఒకేసారి 3 పెద్ద సినిమాలు రావొచ్చని, ఆ స్టామినా బాక్సాఫీస్ కు, భరించే శక్తి థియేటర్లకు ఉందని ఇదే దిల్ రాజు గతంలో ప్రకటన చేశారు. సినిమాలు రిలీజ్ చేశారు కూడా. ఇప్పుడు బంగార్రాజు సంక్రాంతికి వస్తే ఇదే కొటేషన్ ను మళ్లీ తెరపైకి తెస్తారేమో. ఇక్కడ 'పాన్ ఇండియా' అనే కొర్రీ బంగార్రాజుకు పనిచేయదా..?

వాస్తవంగా చూసుకుంటే.. భీమ్లానాయక్ సినిమా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ కు గట్టిపోటీ. ఈ రెండు సినిమాల మధ్యలో పవన్ సినిమా వచ్చి ఉన్నట్టయితే.. అటు ఆర్ఆర్ఆర్, ఇటు రాధేశ్యామ్ సినిమాలకు గట్టిగా దెబ్బ పడేది. పవన్ కు ఉన్న క్రేజ్, అతడి మార్కెట్ అలాంటిది. అందుకే కిందామీద పడి భీమ్లాను సంక్రాంతి బరి నుంచి తప్పించారు.

బహుశా బంగార్రాజు విషయంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కు ఆ టెన్షన్ లేనట్టుంది. ఆర్ఆర్ఆర్-రాధేశ్యామ్ మధ్యలో బంగార్రాజు వచ్చినా.. జనవరి 15వ తేదీన విడుదలైనా పెద్ద ఫరక్ పడదనే ఉద్దేశంలో దిల్ రాజు ఉన్నట్టున్నారు. కానీ భీమ్లాను తప్పించి, సంక్రాంతి బరిలో మరే సినిమాను దించినా పవన్ ఫ్యాన్స్ నుంచి సెగ తప్పదు.

అటు బంగార్రాజు యూనిట్ మాత్రం గడిచిన నెల రోజులుగా సంక్రాంతి రిలీజ్ అనే ఫీలర్ వదులుతూనే ఉంది. తాజాగా భీమ్లా పోస్ట్ పోన్ అయిన సందర్భంగా మరోసారి 'అన్నపూర్ణ' కాంపౌండ్ నుంచి ఈ గాసిప్ గుప్పుమంది. అయితే సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్టర్ వేసే ధైర్యం మాత్రం చేయలేదు నాగార్జున. లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తూ హంగామా  చేస్తున్నారంతే. బహుశా.. సహ-నిర్మాతలుగా వ్యవహరిస్తున్న జీ గ్రూప్ నుంచి నాగ్ పై ఒత్తిడి పడుతున్నట్టుంది.