‘దేవుడు’ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సారి దేవుడి అవతారం ఎత్తబోతున్నారు. గతంలో గోపాల గోపాల అనే సోషియో ఫాంటసీ సినిమాలో ఆయన దేవుడి క్యారెక్టర్ చేసారు. ఇప్పుడు మరోసారి అదే పని చేయబోతున్నారు.…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సారి దేవుడి అవతారం ఎత్తబోతున్నారు. గతంలో గోపాల గోపాల అనే సోషియో ఫాంటసీ సినిమాలో ఆయన దేవుడి క్యారెక్టర్ చేసారు. ఇప్పుడు మరోసారి అదే పని చేయబోతున్నారు. పైగా అలాంటి సూపర్ క్యారెక్టర్లు చేయడం అంటే ఆయనకు ఇష్టం కూడా.

నటుడు సముద్రఖని డైరక్షన్ లో తయారయ్యే తమిళ రీమేక్ లో పవన్ ఓ స్పెషల్ రోల్ పోషించబోతున్నారు. ఆ రోల్ నే దేవుడి పాత్ర. ఈ సినిమాలో యంగ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ నటిస్తారని తెలుస్తోంది. 

వినోధ్య సిథమ్ అనే తమిళ సినిమా ఆధారంగా ఈ సినిమా తయారవుతుందని, ఇక్కడ నేటివిటీ, హీరోలకు అనుగుణంగా మొత్తం స్క్రిప్ట్ ను మార్చి తీస్తారని తెలుస్తోంది. క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా తరువాత ఈ సినిమా వుంటుంది. 

ఈ సినిమా కోసం పవన్ మరీ ఎక్కువ రోజులు వర్క్ చేయనక్కరలేదు. అందుకే భవదీయుడు భగత్ సింగ్ సినిమా కన్నా ముందుగా ఈసినిమాను ఫినిష్ చేస్తారు.