త్రివిక్రమ్ ఫీల్ అయ్యారా?

ఒడ్టు దాటే వరకు ఓడ మల్లన్న..దాటేసాక బోడి మల్లన్న అన్నది సామెత. భీమ్లా నాయక్ విషయంలో దర్శకుడు రాజమౌళి వైఖరి ఇలాగే వుందని టాలీవున్ ఇన్ సైడ్ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన…

ఒడ్టు దాటే వరకు ఓడ మల్లన్న..దాటేసాక బోడి మల్లన్న అన్నది సామెత. భీమ్లా నాయక్ విషయంలో దర్శకుడు రాజమౌళి వైఖరి ఇలాగే వుందని టాలీవున్ ఇన్ సైడ్ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఈ రోజు వేసిన రెండు ట్వీట్ ల విషయంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

అనవసరంగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను రాజమౌళి తెలివిగా బరిలోకి లాగారు. నిజానికి ఆ సినిమా సంక్రాంతికి రమ్మన్నా రాలేదు. కనీసం 30 రోజుల షూటింగ్ వుంది ఇంకా. అయితే ఇక్కడ రాజమౌళి ఎత్తుగడ వేరు. 

మెగా హీరోల ఫ్యాన్స్ ఎలాగూ ఆర్ఆర్ఆర్ పట్ల పాజిటివ్ నే. ఎన్టీఆర్ ఫాన్స్ ఓకె. ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాగూ రాధేశ్యామ్ వైపు వుంటారు. ఇక మిగిలింది ఎవరు. మహేష్ ఫ్యాన్స్,. వాళ్లను దువ్వాలి అనుకున్నారేమో, ఆ ట్వీట్ వేసేసారు.

పోనీ అది బానే వుంది అనుకుందాం. భీమ్లా నాయక్ వాయిదా పై తన థాంక్స్ చెప్పాలి కదా. అందుకోసం వేసిన ట్వీట్ చాలా మొక్కుబడిగా వుంది. పవన్ కు ట్విట్టర్ అక్కౌంట్ వుందని కూడా రాజమౌళికి తెలియదా? పైగా నిర్మాత చినబాబు పేరు ముందు వేసి, వెనుక పవన్ పేరు వేయడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 

అసలు భీమ్లా నాయక్ వాయిదా అన్నది దర్శకుడు త్రివిక్రమ్ తలుచుకోకపోతే జరిగేది కాదు. అది అందరికీ తెలుసు. కానీ రాజమౌళి ఆయన ప్రస్తావనే తేలేదు. ఈ ట్వీట్ చూసి దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఫీలయినట్లు తెలుస్తోంది.