పవన్ ను అవమానించిన దిల్ రాజు?

ఏస్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు తన స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ను వెనక్కు పంపారా? రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమాలు అని చెబుతూ పవన్ సినిమాను అవమానించారా? …

ఏస్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు తన స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ను వెనక్కు పంపారా? రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమాలు అని చెబుతూ పవన్ సినిమాను అవమానించారా? 

ఓ పాపులర్ తెలుగు న్యూస్ చానెల్ తన వెబ్ సైట్ లో ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. కొంతమంది నిర్మాతలతో గిల్డ్ ను తన కంట్రోల్ లో నడుపుతున్న దిల్ రాజు కావాలని వ్యూహాత్మకంగా భీమ్లా నాయక్ ను కీలకమైన సంక్రాంతి బరిలోంచి తప్పించి, పెద్దగా ముఖ్యం కాని ఫిబ్రవరి నెలలోకి తోసారని ఆ కథనంలో ఆరోపించారు. 

ఇదంతా భీమ్లా నాయక్ నిర్మాతలకు ఇష్టం లేకపోయినా, గిల్డ్ పన్నిన వ్యూహంలో చిక్కుకుని మౌనంగా భరించక తప్పలేదని ఆ కథనంలో పేర్కొన్నారు. 

దిల్ రాజు ను దిల్ లేని రాజు అంటూ ఆ కథనంలో నోట్ చేయడం అల్టిమేట్ అనుకోవాలి.