ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు. జగన్ ఇంటితో పాటు చంద్రబాబు ఇంట్లో కూడా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ రోజు జగన్తో పాటు టీడీపీ యువనేత నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి పుట్టిన రోజు కావడం విశేషం. దీంతో పాలక ప్రతిపక్ష నేతల ఇళ్లలో సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రధాని మోడీతో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ట్విటర్ వేదికగా జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కేక్ కట్ చేశారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ నాయకుడిపై వివిధ రూపాల్లో అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఇక బ్రాహ్మణి విషయానికి వస్తే… ఆమెకు టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బ్రాహ్మణికి ట్విటర్ వేదికగా లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు. బ్రాహ్మణిని గుర్తు చేసుకుంటూ లోకేశ్ భావోద్వేగ ట్వీట్ చేశారు.
‘నా జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, చీకటి వెలుగుల్లో, కష్టనష్టాల్లో ధైర్యంగా నిలబడటానికి ఒకే కారణం.. స్ఫూర్తివం తమైన మహిళ నాకు భార్యగా దొరకడం.. హ్యాపీ బర్త్ డే బ్రాహ్మణి ’అంటూ లోకేశ్ ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణితో కలిసి దిగిన ఫొటోను లోకేశ్ ట్వీట్ చేశారు.