విశాఖకు నిధుల వరద…!

విశాఖపట్నం ఏం అద్రుష్టం చేసుకుందో కానీ  అడగని వరాన్నే ముఖ్యమంత్రి జగన్  ప్రసాదిస్తున్నారు. విశాఖను రాజధాని చేస్తారా అన్న అనుమానాల నుంచి ఏకంగా రాజధానినే ఇక్కడికి  తెచ్చేస్తున్నారు. ఇది కలా నిజమా అని అయోమయంలో…

విశాఖపట్నం ఏం అద్రుష్టం చేసుకుందో కానీ  అడగని వరాన్నే ముఖ్యమంత్రి జగన్  ప్రసాదిస్తున్నారు. విశాఖను రాజధాని చేస్తారా అన్న అనుమానాల నుంచి ఏకంగా రాజధానినే ఇక్కడికి  తెచ్చేస్తున్నారు. ఇది కలా నిజమా అని అయోమయంలో విశాఖ జనం ఉండగానే ఒక్కసారిగా నిధుల వరదను పారించేస్తున్నారు.

విశాఖ చరిత్రలో  ఇంత పెద్ద ఎత్తున నిధులను ఇంతకు ముందు పాలకులు  విడుదల చేసింది ఎక్కడా లేదు. హుదూద్ తుపాను సమయంలో కూడా నాయకుల  హామీలైతే కోటలు దాటాయి,  ప్రధాని మోడీ స్వయంగా ఇచ్చిన  వేయి కోట్ల రూపాయల తక్షణ సాయం హామీలోనూ సగం డబ్బు ఇప్పటికీ రావాల్సివుందంటే విశాఖ పట్ల వివక్ష అంతా ఇంతా కాదుగా.

ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ విశాఖకు ఏకంగా ఒక్క జీవోతో  394 కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేయడంతో విశాఖకు మహర్దశ మొదలైందని అంతా భావిస్తున్నారు.ఈ నిధులతో పాటుగా మరో 1400 కోట్ల రూపాయలతో విశాఖలో అభివ్రుధ్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

అంటే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల నిధులు ఒక్కసారిగా విశాఖను ముంచెత్తాయన్న మాట.ఈ సందర్భంగా గత టీడీపీ సర్కార్ పాలన కూడా గుర్తుకుతెచ్చుకోవాలి. ఆనాడు మొదటి మూడేళ్ళు వెనకబడిన జిల్లాలకు జిల్లాకు యాభై కోట్లు వంతున కేంద్రంలోని మోడీ సర్కార్ విడుదల చేసింది.

ఆ విధంగా మూడు జిల్లాలకు మూడేళ్ళలో 450 కోట్ల రూపాయలు విడుదల అయితే దాన్ని కూడా ఇక్కడ ఖర్చు చేయకుండా అమరావ‌తి ఖాతాకు మళ్ళించిన ఘనత నాటి పాలకులదేన‌ని విమర్శలు ఉన్నాయి.ఇపుడు విశాఖకు పారుతున్న నిధులతో పాటు రాజధాని కూడా తరలి రావడంతో భవిష్యత్తులో విశాఖ ప్రగతి పూర్తిగా సాధిస్తుందని అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విశాఖకు రాజయోగం ఇన్నాళ్ళకు స్టార్ట్ అయిందన్న మాట.

త్రివిక్రమ్ నోటి మాటే సామజవరగమన