ఈసారి ‘సంతోషం’ తప్పదేమో?

సంతోష్ శోభన్. హుషారైన యంగ్ అప్ కమింగ్ హీరో. అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమాలు ఇస్తున్నారు. కానీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ మాత్రం రావడం లేదు. ఈసారి సక్సెస్ వెదుక్కుంటూ వస్తున్నట్లే వుంది. అన్నీ…

సంతోష్ శోభన్. హుషారైన యంగ్ అప్ కమింగ్ హీరో. అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమాలు ఇస్తున్నారు. కానీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ మాత్రం రావడం లేదు. ఈసారి సక్సెస్ వెదుక్కుంటూ వస్తున్నట్లే వుంది. అన్నీ మంచి శకునములే సినిమా టీజర్ చూస్తుంటే. 

పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ప్లస్ ఎమోషన్ జానర్ సినిమా. సంతోష్ ఇంతకు ముందు ఇలాంటి సినిమా చేయలేదని కాదు. ఇలాంటి జానర్ ను డీల్ చేయగలిగిన డైరక్టర్ చేతిలో పడలేదు.

నందినీరెడ్డి ఇలాంటి సినిమాలు పక్కాగా డీల్ చేస్తారు. స్వప్న సినిమాస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా మొత్తం హిల్ స్టేషన్ లోకేషన్ లో తీసారు. ఓ కుటుంబం, బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు అన్నీ కలబోసినట్లుంది టీజర్. నటులంతా అనుభవం పండిన వారు. ఏరికోరి తీసుకున్నవారు. దర్శకురాలు సరిగ్గా సెట్ అయ్యారు. అందువల్లే టీజర్ హోప్ ఫుల్ గా కనిపించింది.

కథ, కథనం ఏమాత్రం బాగున్నా, సంతోష్ శోభన్ కు వెదుకుతున్న సక్సెస్ దక్కినట్లే అవుతుంది. మే నెలలో ఈ సినిమా జనాల ముందుకు వస్తుంది.మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, అమల, షావుకారు జానకి, రావు రమేష్, నరేష్, వెన్నెలకిషోర్ ఇలా కాస్త గట్టి కాస్టింగ్ కనిపించి, ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అనేట్లే వుంది టీజర్ చూస్తుంటే. మిక్కీ జే మేయర్ సంగీతం ప్లస్ పాయింట్.